ఎయిర్ ఫోర్స్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనకు తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (AP Singh) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వాయుసేనకు వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. వాయుసేన (Air Force)కు అధిపతిగా విధులు నిర్వహిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది.

ఈ నేపథ్యంలోనే అమర్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30న వాయుసేన దళ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 1964 అక్టోబర్ 27న జన్మించిన ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Air Marshal Amar Preet Singh appointed next Chief of Air Force

1984 డిసెంబర్ నెలలో భారత వైమానిక దళంలో ప్రవేశించారు ఏపీ సింగ్. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కమాండ్ సిబ్బంది, బోధనా, విదేశీ నియామకాలతో సహా అనేక కీలక పదవులను చేపట్టారు. అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్ గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా గుర్తింపు పొందారు. అంతేగాక, ఎయిర్ మార్షల్ యుద్ధ స్క్రాడ్రన్, ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్ కు నాయకత్వం వహించారు.

నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో ప్రాజెక్టు డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా పనిచేశారు. మాస్కోలో మిగ్-29 అప్ గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి నాయకత్వం వహించారు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ పరీక్షలను ఏపీ సింగ్ పర్యవేక్షించారు. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ స్టాఫ్ ఆఫీసర్‌గా కీలక విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అత్యంత అనుభవమున్న ఆయనే తదుపరి ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+