కరోనాకు తోడైన కాలుష్యం-భారత్ లో శ్వాస సమస్యల విజృంభణ-చలితో మరింత తీవ్రం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోందని సంబర పడే లోపే వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే కరోనా సమస్యల నుంచి బయటపడుతున్న వారితో పాటు ఇప్పటివరకూ కరోనా సోకని వారిపైనా వాయుకాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే కరోనాతో బాధపడుతూ ఉన్న వారితో పాటు గతంలో కరోనా సోకిన వారికి వాయుకాలుష్యం తోడై తీవ్ర శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో భారతీయులకు ఈ కాంబినేషన్ మరో కొత్త మహమ్మారిగా మారిపోతోంది.

కరోనా మహమ్మారి
దేశవ్యాప్తంగా గతేడాది ఆరంభంలో మొదలైన కరోనా ఫస్ట్ వేవ్ ఏడాది చివరికి తగ్గిందని భావిస్తున్న తరుణంలో ఈ ఏడాది సెకండ్ వేవ్ మరింత తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత ధర్డ్ వేవ్ భయాలూ అలుముకున్నాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షల మంది భారతీయులు చనిపోయారు. మరింత మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. వీరిలో రోగ నిరోధక శక్తి పరిమితంగా మారిపోయింది. దీంతో వీరంతా ఇప్పుడు ఏ రిస్క్ తీసుకునేందుకు సిద్దంగా లేరు. కానీ అంతలోనే వారిని మరో మహమ్మారి చుట్టేస్తోంది.

దీపావళితో పెరిగిన వాయు కాలుష్యం
దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గతేడాది కరోనా కారణంగా జనం దీపావళికి దూరం కావడంతో వాయు కాలుష్యం ప్రభావం కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరిగి ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్ధాయికి చేరడంతో వాటితో పాటే వాయు కాలుష్యం కూడా పెరుగుతూ పోయింది.
అదే సమయంలో దీపావళి కూడా రావడంతో గతేడాది పండుగ మిస్సయ్యామన్న భావనలో ఉన్న జనం .. ఈసారి కాస్త హంగామా చేశారు. దీని ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. ఈసారి దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోయింది. ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోనూ దీని ప్రభావం భారీగా పెరిగింది.

కరోనాకు తోడైన వాయుకాలుష్యం
గతేడాది నుంచి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయంలో భారీ ఎత్తున మృతుల సంఖ్య కూడా పెరిగింది. కానీ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో ఒక్కసారిగా ఆర్ధిక కార్యకలాపాలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయి. పరిశ్రమలన్నీ తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కాలుష్యం కూడా పెరుగుతూ పోతోంది. ఇప్పటికే కరోనా పూర్తిగా తగ్గకపోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అదే సమయంలో వీరిపై వాయు కాలుష్య ప్రభావం కూడా పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో సాధారణ జనానికి ఊపిరాడటం లేదు.

కరోనా-కాలుష్యం డెడ్లీ కాంబినేషన్
దేశంలో ఇప్పటికే సగం జనాభా కరోనా బారిన పడ్డారు. ఏదో ఒక రూపంలో వీరిని కరోనా చుట్టుముట్టింది. దీన్నుంచి కోలుకున్నాక కూడా ఇప్పటికీ వారిపై కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. ఈ సమయంలో వాయు కాలుష్యం విజృంభించడంతో ఇప్పుడు కరోనా, కాలుష్యం కలిసి డెడ్లీ కాంబినేషన్ గా మారిపోయాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశవ్యాప్తంగా శ్వాస సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య అమాంతం పెరుగుతుందని తాజా లెక్కలు చెప్తున్నాయి. వీరిలో గతంలో కరోనాను ఎదుర్కొన్నవారు, తాజాగా కరోనా సోకిన వారు కూడా ఉన్నారు. వీరికి తాజాగా పెరిగిన కాలుష్యం కారణంగా శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో మాస్కులు మరోసారి తప్పనిసరిగా మారిపోతున్నాయి.
Recommended Video

కరోనా-కాలుష్యంతో సమస్యలివే
గతంలో కరోనాతో బాధపడిన వారు, ప్రస్తుతం కరోనా బాధితులుగా ఉన్న వారు వాయుకాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇందులో ప్రధానంగా దగ్గు, అస్తమా, టిష్యూల్లో ఇన్ ఫ్లేషన్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చలికాలం కావడంతో ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్ , ఇండోర్ వంటి నగరాల్లో ఇలాంటి బాధితుల సంఖ్య బారీగా ఉంటోందని కేంద్రం చెబుతోంది. వీరంతా స్ధానికంగా ఎయిమ్స్ లతో పాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రతీ ఏడాదీ ఇలాంటి సమస్యలు ఉంటున్నా .. ఈసారి కరోనాకు కాలుష్యం కూడా తోడై సమస్య మరింత తీవ్రమవుతోందని డాక్టర్లు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications