వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కండోమ్ అడ్వర్‌టైజ్‌మెంట్లన్నీ రాత్రి 10 తర్వాతే, కారణమిదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కండోమ్ ప్రకటనలపై అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎఎస్‌సీఐ) సంచలన నిర్ణయం తీసుకొంది. రాత్రి పది గంటల నుండి ఉదయం 6 గంటల సమయంలోనే కండోమ్ ప్రకటనలు ఇచ్చేలా అన్ని టీవీ చానెళ్ళకు ఆదేశించాలని ఎఎస్‌సీఐ సూచించింది.

సన్నీ లియోన్ కండోమ్ ప్రకటనలపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కండోమ్ ప్రకటనలపై అడ్వర్‌టైజింగ్ స్టాండర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది.

ఈ తరహ అడ్వర్‌టైజ్ మెంట్లపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన సమయంలో టీవీ చానెళ్ళకు పలు సూచనలను చేస్తున్నారు. ఈ సూచనల ఆధారంగా టీవి ఛానెళ్ళకు ఎఎస్‌సీఐ పలు సూచనలు చేస్తోంది.

కండోమ్ ప్రకటనపై

కండోమ్ ప్రకటనపై

ఇటీవల సన్నీ లియోన్ నటించిన కండోమ్ ప్రకటనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు సూచనలను చేసింది.ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. కండోమ్ ప్రకటనలను అర్ధరాత్రి పది గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలని టీవీ చానెళ్ళను కోరింది..

 అభ్యంతరకరమైన దృశ్యాలు

అభ్యంతరకరమైన దృశ్యాలు

పలు సంతాన నిరోధక కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం కోసం అభ్యంతరకరమైన దృశ్యాలను చూపిస్తున్నాయంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఎస్‌సీఐ పేర్కొంది.ఈ మేరకు కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్టు ఎఎస్‌సీఐ వర్గాలు తెలిపాయి.

 ఫిర్యాదుల ఆధారంగా

ఫిర్యాదుల ఆధారంగా

తమ కండోమ్ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకొనేందుకు కంపెనీలు తయారు చేసిన అడ్వర్‌టైజ్‌మెంట్లు కుటుంబసభ్యులతో కలిసి చూసే విధంగా ఉండడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎఎస్‌సీఐ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

టీవీ ఛానెళ్ళను ఆదేశించాలని లేఖ

టీవీ ఛానెళ్ళను ఆదేశించాలని లేఖ

కండోమ్ ప్రకటనలను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటలలోపు ప్రసారం చేసేలా టీవీ చానెళ్ళను ఆదేశించాలని కోరుతూ ఎఎస్‌సీఐ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. ఈ మేరకు కండోమ్ అడ్వర్‌టైజ్‌మెంట్లపై వస్తున్న అభ్యంతరాలను ఆ లేఖలో ప్రస్తావించింది.

English summary
After recieving spate of complaints from viewers against several contraceptives brands using explicit adult content to publicise their products on Television, the Advertising Standards Council of India (ASCI) has suggested that these ads should be aired only during watershed hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X