శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ కిటకిట: విమాన ఛార్జీలు పెంపు: వార్నింగ్ ఇచ్చిన కింజరాపు
Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
అదే సమయంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా బంద్ సైతం కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ షాపులు, వ్యాపార సంస్థలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆందోళనకారులు టైర్లను కాల్చి రోడ్ల మీద పడేసిన సంఘటనలు ఉన్నాయి.

అటు బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామాలతో జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేసవి సీజన్‌లో కాశ్మీర్ అందాలను తిలకించడానికి వెళ్లిన పర్యాటకులందరూ తిరుగుముఖం పట్టారు. అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. పహల్గామ్ దాదాపుగా ఖాళీ అయింది. బయటి వ్యక్తులెవరూ అక్కడ లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
పర్యాటలకులందరూ ఒక్కసారిగా గమ్యస్థానాలను చేరుకోవడానికి విమానాలను ఆశ్రయించారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఫలితంగా ఒక్కసారిగా విమానాశ్రయం క్రిక్కిరిసిపోయింది. టెర్మినల్ లోపల చాలినంత స్థలం లేకపోవడంతో వారంతా ప్రాంగణంలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదే అదనుగా ప్రైవేట్ విమానాయన సంస్థలు అధిక ఛార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టాయి. శ్రీనగర్-ఢిల్లీ, శ్రీనగర్-ముంబై, శ్రీనగర్-కోల్‌కత, శ్రీనగర్-భోపాల్, శ్రీనగర్-జైపూర్, శ్రీనగర్- బెంగళూరు, శ్రీనగర్- హైదరాబాద్.. వంటి మార్గాల్లో అప్పటికప్పుడు ఛార్జీలను పెంచివేశాయి.
విమాన ఛార్జీల పెంపుదలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. విమాన ఛార్జీలపై నిఘా వేశామని, శ్రీనగర్ నుండి పర్యాటకులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోన్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు ఛార్జీల వసూలు చేయకూడదంటూ పౌర విమానయాన సంస్థలకు కఠిన సూచనలు ఇచ్చామని తెలిపారు.

సహేతుక ఛార్జీలను వసూలు చేయాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇప్పటికే నాలుగు అదనపు విమానాలతో పాటు, ఢిల్లీకి మరో మూడు విమానాలు నడిపిస్తోన్నట్లు పేర్కొన్నారు. ఇండిగో 6ఈ 3203 సాయంత్రం 5 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరి 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.
ఇండిగో 6ఈ 3103 సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరి 7:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. రాత్రి 10:30 గంటలకు స్పైస్‌జెట్ విమానం ఢిల్లీకి బయలుదేరుతుంది. ప్రయాణికులకు ఆర్థికభారం పడకుండా శ్రీనగర్ నుండి నడుస్తోన్న అన్ని విమానయాన సంస్థలు క్యాన్సెలేషన్, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేశాయి.
విమానాశ్రయంలో ఆహారం, మంచినీటిని అందుబాటులో ఉంచినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అక్కడ వేచి ఉంటోన్న వారి కోసం బయట టెంట్ల వేసినట్లు చెప్పారు. తాను వ్యక్తిగతంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నానని, హోం మంత్రిత్వ శాఖ నుంచి వివరాలను తెప్పించుకుంటోన్నానని అన్నారు.
In the wake of the tragic terror attack, we are constantly making efforts to ensure safe travel of tourists from Srinagar. Strict instructions were given to Airline companies to avoid any fare surges, Fares are being monitored and kept at reasonable levels.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) April 23, 2025
In addition to the… pic.twitter.com/jpxhvDDZl6
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications