చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7 ఏళ్ల తర్వాత నిర్లక్ష్యానికి జరిమానా రూ. 50వేలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఓ విమాన ప్రయాణికుడి వస్తువుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్వవహరించినందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల ఫోరం రూ. 55వేల జరిమానా విధించింది. బ్యాగేజి విషయంలో నిర్లక్ష్యంగా వ్వవహరించి ప్రయాణికుడిని మనోవేదనకు గురి చేసినందుకు ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన అశోక్ బాలసుబ్రమణియన్ అనే వ్యక్తి కమర్షియల్ పైలట్ కోర్సు చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లాడు. కోర్సు పూర్తైన అనంతరం 2008, ఆగస్టు 3న జోహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నైకు కనెక్టింగ్ ప్లయిట్‌ ఎక్కాడు.

చెన్నైకు వచ్చిన తర్వాత తన లగేజీ పోయినట్టు గుర్తించి అశోక్ బాలసుబ్రమణియన్ ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాడు. లగేజీ పోయిందని, దీనికి పరిహారంగా 200 డాలర్లు ఇస్తామని ఈ ఏడాది ఆగస్టు 28న అశోక్‌కు ఎయిర్‌లైన్స్ లేఖ రాసింది.

Airlines fined Rs 55,000 for losing baggage 7 years ago

దీంతో ఆతడు తమిళనాడులోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌ నిర్లక్ష్యంతో తన కెరీర్‌కు నష్టం జరిగిందని, పైలట్ లైసెన్స్, సర్టిఫికెట్లతో పాటు కీలక పత్రాలు పోయాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తనకు పరిహారంగా రూ. 50 లక్షలు ఇప్పించాలని కోరాడు. అయితే టికెట్‌పైన ముఖ్యమైన పత్రాలు తమ దగ్గరే ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించామని ఎమిరేట్స్ తన వాదనలో పేర్కొంది. చివరకు విమానయాన చట్ట ప్రకారం రూ.55 వేలు పరిహారం జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

English summary
The state consumer commission has slapped Emirates Airlines with a fine of 55,000 for losing the baggage of a passenger about seven years ago, and said, payment of damages could not be restricted to the terms of any act, as "there is no bar to grant justifiable compensation for causing mental agony."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X