ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: అన్ లిమిటెడ్ కాల్స్.. రోజుకు 3జీబీ డేటా!
ఐఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జియోకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సంచలన ఆఫర్ తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో నెలకొన్న పోటీ వాతావరణం అల్టిమేట్ గా మొబైల్ వినియోగదారులకు వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా జియోకు పోటీగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఐఫోన్ వినియోగదారుల కోసం ఇటీవల రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జియోకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సంచలన ఆఫర్ తీసుకొచ్చింది.

రూ. 799తో రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే రూ. 799తో రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా వస్తుంది. ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.
ఇటీవల ఐఫోన్ 8, 8ప్లస్ ఫోన్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫోన్లపై జియో పలు ఆఫర్లు ప్రకటించింది. నెలకు రూ.799తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ప్రకటించింది. దీంతో జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఇప్పుడు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
జియో దెబ్బకు అన్ని టెలికాం సంస్థలు వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ రోజుకు 3జీబీ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్, ఐడియా లాంటి సంస్థలు కూడా అందుబాటు ధరల్లో డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.












Click it and Unblock the Notifications