జియోకు షాక్: వోల్ట్‌ సేవలను ప్రారంభించనున్న ఎయిర్‌టెల్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రిలయన్స్‌ జియోకు చెక్ పెట్టేందుకు ఎయిర్‌టెల్ రంగం సిద్దం చేసింది. వచ్చే వారమే ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 'వోల్ట్' సేవలు అందించనున్నట్టు సమాచారం. ఎయిర్‌టెల్ కూడ వోల్ట్ సేవలను వినియోగించనుంది.

. తాజాగా ఎయిర్‌టెల్ వోల్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని రిలయన్స్ జియోపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది.

Airtel to start offering free VoLTE calls from next week to take on Jio

4జీ వినియోగదారులకు ఉచిత వాయిస్ కాల్స్ కోసం జియో వినియోగిస్తున్న 'వోల్ట్'నే ఎయిర్‌టెల్ కూడా ఉపయోగించనున్నట్టు సమాచారం. ఇప్పటికే 6 ప్రధాన నగరాల్లో ఎయిర్‌టెల్ 'వోల్ట్' టెక్నాలజీని పరీక్షించినట్టు సమాచారం.

తొలుత ముంబై వోల్ట్ సేవలను ప్రారంభించనున్న ఎయిర్‌టెల్... క్రమంగా మిగతా మెట్రోపాలిటన్ నగరాలకు కూడా విస్తరించనుంది. మరోవైపు టెలీకం సంస్థలన్నీ తమ వినియోగదారులకు వాయిస్‌కాల్స్ ఉచితంగా అందించనున్నట్టు ప్రచారం సాగుతోంది.

4జీ నెట్‌వర్క్‌తో వోల్ట్ కాల్స్‌ను ఉచితంగా చేసుకునే అవకాశం ఉండడం, ఇప్పటికే జియో ఇందులో విజయవంతం కావడంతో టెల్కోలన్నీ ఆ దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మనదేశంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మాత్రమే వోల్ట్ టెక్నాలజీతో వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. మిగతా సంస్థలన్నీ తమ 4జీ కస్టమర్లకు కూడా వాయిస్ కాల్స్ కోసం ఇంతకు ముందున్న 2జీ, 3జీ మీదనే ఆధారపడుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It has been in the works for some time. Now Airtel VoLTE service is apparently here. According to a report on Friday, India's biggest telecom operator will launch its VoLTE calling service next week in Mumbai. With VoLTE calls, which will use 4G data network and hence will be effectively free for consumers, Airtel hopes to take on Jio. Currently Jio is the only telecom operator offering VoLTE calls. In fact, Jio is all-data network, where all calls are made using 4G connectivity.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X