కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య .. ఎందుకంటే
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కోర్టు మెట్లు ఎక్కారు. తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ చానల్స్ పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన పిటిషన్లో కోరారు.
నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తూ, అసత్య వార్తలు ప్రచారం చేస్తూ తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని సదరు యూట్యూబ్ ఛానల్ లను డీ లిస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆరాధ్య బచ్చన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను మైనర్ నని, తనపై లేనిపోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు.

ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ పిటిషన్ ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. అయితే బాలీవుడ్ చింగారి, బాలీవుడ్ టైమ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఈ లిస్టు లో ఉండటంతో, కోర్టులో ఈ కేసు విచారణలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక అమితాబ్ బచ్చన్ కుటుంబంపై ట్రోలింగ్ ఇదేమీ మొదటిది కాదు. గతంలోనూ అనేక సందర్భాలలో ఆరాధ్య బచ్చన్ పై ట్రోలింగ్స్ చోటుచేసుకున్నాయి.
ఇటీవల అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్ విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అందుకే ఇటీవల ఎక్కడ కార్యక్రమాలకు అయినా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ కలిసి కనిపించటం లేదని ఐశ్వర్య రాయ్ తన కూతురు తోనే వేడుకలకు వస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక తమ వ్యక్తిగత జీవితాన్ని, తన కుమార్తెను 24 గంటలూ ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై అభిషేక్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక పబ్లిక్ ఫిగర్ గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందో తాను అర్థం చేసుకోగలనని కానీ, తన కూతురు పై ట్రోలింగ్ ఏ రకంగానూ సమర్థనీయం కాదని, ఏదైనా అలా అనుకుంటే తనని డైరెక్టుగా అనాలని అభిషేక్ బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కడంతో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications