వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మోడీ ఎన్నిక చెల్లదు' : అలహాబాద్ హైకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్

|
Google Oneindia TeluguNews

లక్నో : 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం.. ప్రధాని మోడీ ప్రజలను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో మోడీ ముఖచిత్రాలతో ఉన్న టీషర్ట్ లను, పోస్టర్లను ఓటర్లకు పంపిణీ చేశారని, ఇలాంటి చర్యలు ఒకరకంగా జనాలను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన లంచంగానే పరిగణించాల్సి వస్తుందని అజయ్ రాయ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Ajayrai petition On modi in allahabad highcourt

కాగా, 2014 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి మోడీకి ప్రత్యర్థికి పోటి చేసి ఓడిపోయారు అజయ్ రాయ్. ఇక తాజాగా ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మోడీ తరుపు న్యాయవాదులు.. పిటిషన్ లో అజయ్ రాయ్ పేర్కొన్న కారణాలన్ని అసంబద్దమైనవేనని వాదించారు.

పిటిషన్ లో పేర్కొన్న ఆరోపణలన్ని ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావని మోడీ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ.. నవంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

English summary
Congress leader Ajay rai was claimed a petition in allahabad highcourt by challenging modi victory in varanasi election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X