వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవుల పంపకాల్లో తేడా: అలిగిన అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి.. కానీ!

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో మొన్నటిదాకా ఒక రకమైన హైడ్రామా నడిస్తే.. ఇప్పుడు ఇంకో తరహా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలకలు, బుజ్జగింపులు షురూ అయ్యాయి. మరి కొన్ని గంటల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. మహా వికాస్ అఘాడి కూటమిలో పదవుల పంపకాలపై స్పష్టత రాలేదు. ఫలితంగా- ఉద్ధవ్ తో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ పేరు దాదాపు ఖరారైంది. నిన్నటి దాకా ఎన్సీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలనలో ఉన్న ఎన్సీపీకే చెందిన మరో సీనియర్ నాయకుడు జయంంత్ పాటిల్ రేసు నుంచి తప్పుకొన్నారు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జయంత్ పాటిల్ వైదొలగిన నేపథ్యంలో.. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్ పవార్ కు దక్కడం ఖాయమైనట్టే.

అయినప్పటికీ- గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఈ విషయాన్ని అజిత్ పవార్, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిగా గానీ లేదా మంత్రిగా గానీ తాను ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేయట్లేదని అజిత్ పవార్ వెల్లడించారు. గురువారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో జరిగే కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరేతో పాటు ఆరు మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.

Ajit Pawar likellyTo Be Back As Deputy Chief Minister, but he will not taking oath today

ఉద్ధవ్ థాకరే కాకుండా.. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ల నుంచి ఇద్దరు చొప్పున ఆరుమంది శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తేలింది. ప్రస్తుతానికి ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొరట్ ల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే మరో నలుగురు ఎవరనే అంశం మీద సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పేరు వినిపించింది.

ఇదివరకు అశోక్ చవాన్ పై నమోదైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణం ఫైలును కదిలించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు సన్నద్ధమైంది. ఈ కేసులో తాజాగా కదలిక చోటు చేసుకుంది. ఫలితంగా- అశోక్ చవాన్ పేరును మంత్రుల జాబితా నుంచి తొలగించారు. అశోక్ చవాన్ ప్రమాణ స్వీకారం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ తాజాగా వెల్లడించింది. అశోక్ చవాన్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. పృథ్వీరాజ్ చవాన్ పేరును పరిశీలించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary
NCP leader Ajit Pawar: I am not taking oath today. Today six leaders will be taking oath from each party (Shiv Sena, NCP, Congress). The decision on Deputy Chief Minister is yet to be taken by the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X