వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక అంతా ఒకే!: శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్

|
Google Oneindia TeluguNews

ముంబై: బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ అందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత మంగళవారం డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మరోసారి ఆశ్చర్యానికి గురిచేశారు. ఎన్సీపీ అజిత్ పవార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించినప్పటికీ.. మళ్లీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైంది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: రాజ్‌భవన్‌కు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలుప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: రాజ్‌భవన్‌కు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి అజిత్ పవార్ చేరుకున్నారు. ఆయనతో సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలను ఆయన శరద్ పవార్‌కు వివరించినట్లు సమాచారం. ఈ భేటీలో మరో కీలక నేత సుప్రియా సూలే కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక అజిత్ పవార్ మళ్లీ ఎన్సీపీలోనే కొనసాగే అవకాశం ఉంది.

Ajit Pawar meets Sharad Pawar in his residence

గవర్నర్‌ను కలిసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు కూటమి నేతలు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి నివాసానికి చేరుకున్నారు. శివసేన నేతలు ఏకనాథ్ షిండే, సునీల్ ప్రభు, మిలింద్ నర్వేకర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు.

ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యేలు బాధ్యలు చేపడతారని, డిసెంబర్ 1న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు.

కాగా, శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి సరికొత్త పేరును పెట్టారు. మహా వికాస్ అఘాడి అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని కూటమి నాయకులు వెల్లడించారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినందున.. దీనిపై ఎలాంటి చర్చలు లేవని తెలిపారు.

English summary
Ajit Pawar has reached Silver Oak, the residence of Sharad Pawar. The meeting between the two NCP leaders is now underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X