Ajmer: నుపూర్ శర్మా తల నరకండి, కాల్చేయండి, అజ్మీర్ దర్గా మౌల్వీ వీడియో వైరల్, అరెస్టు, దర్గా కమిటీ ఫైర్ !
అజ్మీర్/రాజస్థాన్: మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపూర్ శర్మా మీద వివావాదాస్ప వ్యాఖ్యలు చేసిన అజ్మీర్ దర్గా మౌల్వీని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ మాజీ నాయకురాలి మీద వివావాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. నుపూర్ శర్మా తల నరికి తీసుకు వస్తే నా ఇంటిని రాసిస్తానని, మేమే కాల్చి చంపేస్తామని దర్గా మౌల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. అజ్మీర్ దర్గా మౌల్వీని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దర్గా మౌల్వీ వ్యాఖ్యలను దర్గా కార్యాలయం ఖండించడం కొసమెరుపు.

కలకలం రేపిన నుపూర్ శర్మా
మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అప్పటి బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మా మీద ముస్లీం సోదరులు మండిపడ్డారు. నుపూర్ శర్మా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. గల్ఫ్ దేశాలకు చెందిన వారు సైతం నుపూర్ శర్మా వ్యాఖ్యల మీద విమర్శలు చేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అజ్మీర్ దర్గా మౌల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదే సమయంలో నుపూర్ శర్మా మీద రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా మౌల్వీ సల్మాన్ చస్తీ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మా తల నరికి నాదగ్గరకు వస్తే నా ఇల్లు వాళ్లకు రాసిస్తానని అజ్మీర్ దర్గా మౌల్వీ సల్మాన్ చస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

కాల్చి చంపేస్తాను అని వార్నింగ్
నుపూర్ శర్మాను రివాల్వర్ తో కాల్చి చంపేస్తానని చెప్పిన అజ్మీర్ దర్గా మౌల్వీ సల్మాన్ చస్తీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం దూమరం రేపింది. అజ్మీర్ దర్గా మౌల్వీ సల్మాన్ చస్తీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. నుపూర్ శర్మా మీద వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి మతాల మద్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని అజ్మీర్ దర్గా మౌల్వీ సల్మాన్ చస్తీ మీద పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు.

దర్గా కార్యాలయం ఫైర్
నుపూర్ శర్మా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ చస్తీకి నేర చరిత్ర ఉందని పోలీసు అధికారి దల్వీందర్ సింగ్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ వెళ్లడించింది. అయితే అజ్మీర్ దర్గా దేవాన్ జైనుల్ అబెదిన్ ఆలీ ఖానా కార్యాలయం మౌల్వీ సల్మాన్ చస్తీ వ్యాఖ్యలను ఖండించింది. ఇది పూర్తిగా సల్మాన్ చస్తీ వ్యక్తిగత వ్యాఖ్యలని, అతని వ్యాఖ్యలకు దర్గాకు ఎటువంటి సంబంధం లేదని, మేము అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని దర్గా కమిటీ స్పష్టం చేసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications