వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ సమాచారంలేదు, ఎక్కడో పేపర్లో చూశా: 'బాబ్రీ' కేసుపై అద్వానీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ బుధవారం స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అలాగే, ఈ విషయమై తాను ఎక్కడా న్యూస్ పేపర్‌లో చదవలేదని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ బుధవారం స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఈ విషయమై తాను న్యూస్ పేపర్‌లో ఎక్కడో చదివానన్నారు.

కాగా, 1992, డిసెంబర్‌ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఎల్‌కే అద్వానీకి ఉచ్చు బిగుస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నెల 22న బాబ్రీ మసీదు ధ్వంసానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అద్వానీతో పాటు బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, కేంద్రమంత్రి ఉమా భారతీ, ఇతర బీజేపీ నాయకులు ఆ మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోపణలు చర్చీనీయాంశంగా మారాయి.

Akhbar mein kahin padha tha, Advani’s ‘casual’ remark on Babri Masjid case

ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఇదే చివరి విచారణ కానుందని తెలుస్తోంది. ఆ రోజున బీజేపీలోని కొందరు అగ్రనేతలపై కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలపై అద్వానీ, ఉమాభారతీకి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ అద్వానీ, ఉమా భారతీ, మరో 19మంది నేతలకు గతంలోనే సుప్రీంకోర్టు పంపించింది.

అద్వానీతోపాటు ఇతర నేతలపై ఉన్ కేసులను కింది కోర్టు ఎత్తివేయడాన్ని సీబీఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సాంకేతిక కారణాలు చూపుతూ అద్వానీపై కేసు ఎత్తివేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

విచారణ సుదీర్ఘకాలం కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. నిందితుల సంయుక్త విచారణకు అంగీకరించింది. విచారణను పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
As the 25-year-old Babri Masjid demolition case once again haunts veteran Bharatiya Janata Party leader LK Advani, the former deputy prime minister decided to 'casually' react to the latest statement made by the Supreme Court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X