యుపి రేప్, నేరాలకే ప్రచారమా?: మీడియాపై అఖిలేష్

Akhilesh Yadav accuses media of highlighting only Uttar Pradesh incidents
లక్నో: అత్యాచారాలు, నేరాలు కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని, కానీ మీడియా తమ రాష్ట్రంలోని నేరాలనే ఎత్తి చూపుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అక్కాచెళ్లెల్లపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు, ఇతర నేరాలు బయటపడుతుండటంతో అఖిలేశ్ ప్రభుత్వంపై ఇతర పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిని అఖిలేష్ యాదవ్ మీడియాపైనే రుసరుసలాడారు.

అత్యాచారాలు, నేరాలు ప్రతిచోటా జరుగుతున్నాయని, జాతీయ మీడియా ఉత్తరప్రదేశ్‌లోని నేరాలనే ఎత్తిచూపుతోందని అఖిలేష్ అన్నారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు కన్పించడం లేదా అని అఖిలేశ్ ప్రశ్నించారు.

బదౌన్ ఘటనలో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, సిబిఐ విచారణపైనా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని నేరాలపైనా తగిన చర్యలు తీసుకుంటున్నామని అఖిలేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+