రూ. 25 కోట్లు విరాళం: థ్యాంక్స్ చెప్పిన జయలలిత
చెన్నై/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మానవత్వంతో స్పందించారని, తమిళనాడు ప్రజలను ఆదుకోవడానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు.
వరద బాధితులను ఆదుకోవడానికి రూ. 25 కోట్లు ఆర్థిక సహాయం చేసిన అఖిలేష్ యాదవ్ ను ఆమె అభినందించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలను తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని ఆమె వివరించారు.

చెన్నై వరద బాధితులను ఆదుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇదే సందర్బంలో జయలలిత స్పందించారు.
వయస్సులో చిన్నవాడైనా పెద్ద మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి మీరు ఇచ్చిన విరాళం ఉపయోగిస్తామని జయలలిత స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications