వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు 36, మాకు 32: మాయావతి సంతోషించేలా అఖిలేష్ యాదవ్ ఫార్ములా!

|
Google Oneindia TeluguNews

లక్నో: 2019లో బీజేపీని ఓడించేందుకు తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయిస్తే కలిసి పని చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై ఎస్పీ అఖిలేష్ యాదవ్ స్పందించారు.

జేఎన్‌యూలో మళ్లీ రగడ: విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన హైదరాబాదీజేఎన్‌యూలో మళ్లీ రగడ: విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన హైదరాబాదీ

గ్రాండ్ అలయెన్స్ కోసం అవసరమైతే తాను రెండు అడుగులు వెనక్కి వేస్తానని, కానీ బీజేపీకి గెలిచే పరిస్థితి రానివ్వనని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే మాటలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. దేశం మొత్తంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇతర పార్టీలను ఏకతాటి పైకి తేగలదన్నారు.

Akhilesh Yadav Has a Poll Formula to Keep Bua Mayawati Happy

తమది (ఎస్పీ) జాతీయ పార్టీ కాదని చెప్పారు. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అన్నారు. విపక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీ తమకు అతిపెద్ద ఛాతి ఉందని చెబుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద హృదయం ఉండాలన్నారు.

ఇటీవల మాయావతి మాట్లాడుతూ.. తాను బీజేపీకి వ్యతిరేకంగా గ్రాండ్ అపోజిషన్ అలెయన్స్‌కు వ్యతిరేకం కాదని, కానీ లోకసభ ఎన్నికల్లో బీఎస్పీకి గౌరవప్రదమైన సీట్లు దక్కాలని పేర్కొన్నారు.

కాగా, ఉత్తర ప్రదేశ్‌లో 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 36 సీట్లు మాయావతి పార్టీ బీఎస్పీకి ఇచ్చి, 32 సీట్లు తీసుకునేందుకు అఖిలేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జత కలిస్తే ఆ పార్టీకి 9 స్థానాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

English summary
Hours after BSP chief Mayawati said her party will enter into an alliance only if it is given a “respectable share” of seats, Samajwadi Party (SP) national president Akhilesh Yadav on Sunday said he is ready to take two steps back in order to defeat communal forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X