ప్రమాదంలో నా జీవితం, అఖిలేష్ సపోర్టర్ చంపేస్తానన్నాడు: అమర్ సింగ్
ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతుదారు తనను చంపుతానని బెదిరించాడని రాజ్యసభ సభ్యులు అమర్ సింగ్ ఆరోపించారు.
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతుదారు తనను చంపుతానని బెదిరించాడని రాజ్యసభ సభ్యులు అమర్ సింగ్ ఆరోపించారు. నన్ను ఇక్కడ చంపుతారేమోనని భయం తనకు ఉందని చెప్పారు.
అఖిలేష్ యాదవ్ ఇటీవలే సమాజ్ వాది పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. తనకు బహిరంగంగా చంపుతానని బెదిరింపులు వస్తున్నాయని, తనను ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ టార్గెట్ చేశారేమో అన్నారు.

తనను చంపేస్తామంటూ అఖిలేష్ బాబాయ్, ఆ శిబిరంలో కీలక నేత రాంగోపాల్ యాదవ్ నుంచి బెదిరింపులు వచ్చాయని అమర్ సింగ్ చెప్పడం చర్చకు దారి తీసింది. రాంగోపాల్ యాదవ్ హెచ్చరికల నేపథ్యంలో తన జీవితమే ప్రమాదంలో పడిందన్నారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను మాత్రం ములాయం సింగ్ యాదవ్‌తోనే నిలుస్తానని చెప్పారు. తాను అఖిలేష్‌ను ప్రశంసించినంత మాత్రాన తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని బతిమిలాడినట్లు కాదన్నారు. తనను తాను ములాయం వాదిగా చెప్పుకుంటానన్నారు. కాగా, అమర్ సింగ్‌కు ఇటీవలే కేంద్రం జడ్ కేటగిరీ భద్రతను కల్పించింది.












Click it and Unblock the Notifications