దేశ రాజధానిలో అల్‌ఖైదా ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధమున్న ఓ ఉగ్రవాదిని దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఉగ్రవాది రజా ఉల్ అహ్మద్ నేపాల్ పారిపోతుండగా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్.. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సార్ బంగ్లా సభ్యుడు.
అహ్మద్ గురువారం ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా..పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బెంగాల్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలో ఓ నకిలీ కరెన్సీ రాకెట్ కేసులోనూ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు.

అన్సార్ బంగ్లా.. అల్‌ఖైదాకు అనుబంధ సంస్థ. ఈ సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు నకిలీ పత్రాలతో భారత్‌లోకి చొరబడి.. అల్‌ఖైదా తరఫున పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన తర్వాతి రోజే ఉగ్రవాది అహ్మద్ అరెస్టవడం గమనార్హం.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications