Father: తండ్రిని చంపి 36 గంటలు శవం పక్కనే. తాగుబోతు కొడుకు, చెల్లిని చంపేస్తానని వార్నింగ్ !
పూణే: మద్యంకు బానిస అయిన కొడుకు తండ్రిపట్ల దారుణంగా ప్రవర్తించాడు. మంచంపట్టిన తండ్రితో కొడుకు గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగిపోవడంతో బ్లేడ్ తీసుకున్న కొడుకు అతని తండ్రిని దారుణంగా చంపేశాడు. తండ్రి శవాన్ని బయటకు తరలించడానికి అవకాశం లేకపోవడంతో 36 గంటల పాటు శవాన్ని ఇంట్లోనే పెట్టాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని సోదరిని బెదిరించాడు.
అంత్యక్రియల కోసం ఇంటికి వచ్చిన తల్లి తన భర్త హత్యకు గురైనాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాగుబోతు కొడుకు
మహారాష్ట్రలోని పూణే జిల్లా కాంచన్ ప్రాంతంలో టిప్పువస్తి ప్రాంతంలో షేక్ (67) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. షేక్ కుమారుడు రహీమ్ షేక్ (35) మెకానిక్ గా పని చేస్తున్నాడు. రహీమ్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రోజు పని నుంచి ఇంటికి వచ్చే సమయంలో పీకలదాక మద్యం సేవించి వెళ్లేవాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన తల్లి
కుటుంబ కలహాలకారణంగా షేక్ భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అనారోగ్యానికి గురైన షేక్ మంచంపట్టాడు. రహీమ్ సోదరి కూడా వారి ఇంటిలోనే ఉంటున్నది. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రహీమ్ తండ్రితొ గొడవ పెట్టుకున్నాడు. తరువాత తండ్రీ కొడుకుల మద్య మాటామాట పెరిగిపోయింది.

తండ్రి గొంతు కోసి చంపేసిన కొడుకు
ఆ సమయంలో సహనం కోల్పోయిన కొడుకు రహీమ్ బ్లేడ్ తీసుకుని మంచం మీద ధీనస్థితిలో ఉన్న తండ్రిని గొంతు కోసి చంపేశాడు. అడ్డు వెళ్లిన సోదరిని చంపేస్తానని రహీమ్ బెదిరించాడు. తండ్రి శవాన్ని బయటకు తరలించలేక రహీమ్ సతమతం అయ్యాడు. తండ్రి శవాన్ని గుడ్డలో చుట్టేసి 36 గంటలు ఇంట్లోనే పెట్టి ఆ శవం పక్కనే కొడుకు కాలం గడిపాడు.

నా భర్తను చంపేశారు
తరువాత తన తండ్రి అనారోగ్యంతో మరణించాడని పుట్టింటిలో ఉన్న తల్లికి, బంధువులకు సమాచారం ఇచ్చాడు. అంత్యక్రియలకు వెళ్లిన తల్లి, బంధువులు షేక్ గొంతు కోసి ఉన్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇఛ్చారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కథనం ప్రచురించింది. తండ్రిని హత్య చేసిన రహీమ్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications