ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన విషాదాంతం..! మాజీ సీఎం, పైలట్ల సహా 242 మందీ మృతి..!
ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏఐ171 విమానం కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే అనూహ్యంగా కుప్పకూలిన ఘటనలో మొత్తం 242 మందీ చనిపోయారు. లండన్ కు వెళ్లేందుకు పూర్తిస్థాయి ఇంధనం నింపుకుని వెళ్తున్న ఈ విమానం కుప్పకూలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పడి ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని తేలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది ఎయిరిండియా సిబ్బంది, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరంతా విమానం కుప్పకూలగానే మంటల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయిపోయారు. వీరిలో కొన ఊపిరితో ఉన్న కొందరిని ఆస్పత్రులకు తరలించినా డాక్టర్లు వారిని కాపాడలేకపోయినట్లు తెలుస్తోంది. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమాన ప్రమాదంలో మొత్తం 242 మందీ చనిపోయినట్లు అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జ్ఞానేేేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ ఘటనలో మృతదేహాల్ని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవాళ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన వారిలో 169 మంది భారతీయులతో పాటు 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. వీరితో పాటు విమానంలో సేవలు అందించే 10 మంది సిబ్బంది, పైలట్, కోపైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కుప్పకూలిన హాస్టల్ లో ఉన్న మెడికోలు 50 నుంచి 60 మంది గాయాల పాలయ్యారని అధికారులు ప్రకటించారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరు చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు పరిస్ధితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications