వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సర్కారు కీలక నిర్ణయం: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాది కాలంగా అత్యధిక మంది భారతీయులకు వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామని అన్నారు.

All above 18 eligible for vaccine from May 1

ఇందులో భాగంగానే 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని తెలిపారు. ఔషధ సంస్థలు వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేసేందుకు ప్రోత్సహించడంతోపాటు, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఇతర కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు.

కేంద్రం విడుదల చేసిన మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్

50 శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు అనుమతి

50 శాతం టీకాలు రాష్ట్రాలకు, విపణిలో విక్రయించుకోవచ్చు.

ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు.

ఉత్పత్తి సంస్థలను నుంచి వ్యాక్సిన్లను నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు అనుమతి.

గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు 45 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుంది.

రెండో డోసు తీసుకునేవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వ్యాక్సినేషన్ వృథా చేసే రాష్ట్రాలకు పంపిణీ చేసే వ్యాక్సిన్ కోటాపై ఆ ప్రభావం ఉంటుంది.

Recommended Video

COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

English summary
Vaccinations will be opened to all above 18 from May 1, the government announced today after Prime Minister Narendra Modi held a series of meetings over India's response to record daily surges in Covid cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X