గెలిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 24 గంటల్లో ఆ పని చేస్తారు: ఎవరూ మిగలరు

పనాజీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్‌ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్‌‌ను హస్తగతం చేసుకోవడంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

All Congress MLAs will join in BJP within 24 hours, say Arvind Kejriwal in his Goa election campaign

ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటిేక ఢిల్లీలో వరుస విజయాలను సాధించిన కేజ్రీవాల్ పార్టీ.. చిన్న రాష్ట్రాలైన పంజాబ్, గోవాల్లో పాగా వేయడానికి పావులు కదుపుతోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యత లభిస్తుందంటూ ఇదివరకే కొన్ని పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. అదే ఊపుతో గోవాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది.

తాజాగా- ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవాలో పర్యటిస్తోన్నారు. ఈ పనాజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఫలితాలు ఉంటాయని భావించట్లేదని అన్నారు.

ఆ పరిస్థితే వస్తే- కాంగ్రెస్‌తో పొత్తు దిశగా నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. గెలిచిన తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ మిగలకపోవచ్చని, మిగిలితే పొత్తు విషయాన్ని ఆలోచించవచ్చని నవ్వుతూ వ్యాఖ్యానించారు. గెలిచిన 24 గంటల్లోనే వారంతా భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను తాము సాధించగలుగుతామనే విశ్వాసం ఉందని పేర్కన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+