వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గార్డులు..పీఏల చేతిలో కాంగ్రెస్ - రాజీనామా నిర్ణయం ఎందుకంటే: ఆజాద్..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఇవ్వాళ ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు.

రాజీనామాకు అనేక కారణాలు..

రాజీనామాకు అనేక కారణాలు..

తన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, ప్రధాన అనుచరుడిని జమ్మూ కాశ్మీర్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో ఇక ఆజాద్ పార్టీకి పూర్తిస్థాయిలో దూరమౌతారనే ప్రచారం కూడా సాగుతోంది. దీన్ని నిజం చేశారాయన. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ స్థానానికి రాజీనామా చేయడంతోనే తన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేశారు. అప్పటి నుంచీ ఆయన పార్టీ అధిష్ఠానానికి అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు తాజాగా ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.

టార్గెట్ రాహుల్..

టార్గెట్ రాహుల్..


అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీని ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నారు. సోనియా గాంధీకి పంపించిన అయిదు పేజీల లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లాడి మనస్తత్వంగా అభివర్ణించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా అపాయింట్ అయిన తరువాత సలహాదారుల వ్యవస్థ మొత్తం ధ్వంసమైందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చింపేయడంతోనే రాహుల్ గాంధీకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏ పాటిదో అర్థమైందని అన్నారు.

2014 తరువాత..

2014 తరువాత..

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఓడిపోయిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని ఆజాద్ తన రాజీనామా లేఖలో గుర్తు చేశారు. 2019లోనూ అదే పునరావృతమైందని చెప్పారు. 2014-2022 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 39 సార్లు పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పార్టీ గెలిచిందని, మరో ఆరు ఎన్నికలను మిత్రపక్షాల సహకారంతో విజయం సాధించిందని అన్నారు.

 రెండు చోట్లే అధికారం..

రెండు చోట్లే అధికారం..

దేశంలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని, మరో రెండుచోట్ల బొటాబొటి సీట్ల తేడాతో మిత్రపక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. మూడేళ్లుగా ఏఐసీసీ అధినేత్రిగా సోనియాగాంధీ పని చేస్తోన్నప్పటికీ.. రిమోట్ కంట్రోల్ మోడల్ అనేది వైదొలగట్లేదని ఆజాద్ అన్నారు. సోనియా గాంధీ నామమాత్రంగా ఏఐసీసీ అధినేత్రిగా వ్యవహరిస్తోన్నారని, ఆమెను రిమోట్ కంట్రోల్‌తో నడిపించేది రాహుల్ గాంధేనని ఆజాద్ చెప్పారు.

 భారత్ జోడో యాత్ర కాదు..

భారత్ జోడో యాత్ర కాదు..

పార్టీకి ఇప్పుడు కావాల్సింది భారత్ జోడో యాత్ర కాదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అత్యవసరం అని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నింటినీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకుంటోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు కొనసాగడం సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

English summary
Senior Congress leader Ghulam Nabi Azad quit the party today calling out Rahul Gandhi for immaturity and for demolishing the consultative mechanism in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X