భారత్-పాక్ యుద్ధంపై ముస్లిం పర్సనల్ లాబోర్డు కీలక తీర్మానం..!
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ నుంచి కవ్వింపులు ఎదురవుతున్నా వాటిని తట్టుకుని దూసుకుపోతున్న భారత సైన్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజల నుంచి పూర్తి స్దాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇవాళ జరిగిన ఆఫీస్ బేరర్ల ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చాలా ఆందోళనగా చూస్తుందని తెలిపింది. దేశం, దాని ప్రజల రక్షణ కోసం తీసుకునే ప్రతి అవసరమైన చర్యకు తాము మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్లిష్టమైన సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, సాయుధ దళాలు, ప్రభుత్వం ఈ ముప్పులను ఎదుర్కోవడానికి కలిసి రావాలని పిలుపునిచ్చింది.

ఉగ్రవాదం, అమాయక పౌరుల హత్య ఒక తీవ్రమైన ఆందోళనగా లాబోర్డు పేర్కొంది. ఇస్లామిక్ బోధనలలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సూత్రాలు, మానవ విలువలలో ఉగ్రవాదానికి ఎటువంటి స్థానం లేదని తెలిపింది. అందువల్ల దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరింది. యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నది కూడా వాస్తవం అని తెలిపింది. ముఖ్యంగా అణ్వాయుధాలతో కూడిన యుద్దాన్ని భారత్, పాక్ భరించలేవని వెల్లడించింది.
In a special online meeting of the office bearers of the All India Muslim Personal Law Board, the following resolution was passed:
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) May 9, 2025
The All India Muslim Personal Law Board views the increasing tension on the India-Pakistan border with great concern. It supports every necessary… pic.twitter.com/CvwaDHq4zg
ఈ యుద్దం రెండు దేశాల ప్రజలను అధిగమించలేని ఇబ్బందులు, బాధలలోకి నెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి సమస్యలను సంభాషణ, ఇతర దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించింది. మరోవైపు ముస్లిం పర్సనల్ లా బోర్డు యథావిధిగా తన సేవ్ వక్ఫ్ ప్రచారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, దాని బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలు వచ్చే వారం అంటే మే 16 వరకూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
తోటి పౌరులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, మతాంతర సంభాషణలు, మసీదులలో ప్రసంగాలు, జిల్లా న్యాయాధికారులు , కలెక్టర్ల ద్వారా మెమోరాండమ్‌ల సమర్పణ, పత్రికా సమావేశాలు వంటి ఇండోర్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుత తీవ్రమైన పరిస్థితి త్వరలో పరిష్కరించబడుతుందని, సాధారణ స్థితికి తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లాబోర్డు వెల్లడించింది.












Click it and Unblock the Notifications