బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా ప్రేమ కోసమే?: యువకుడి దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓ యువకుడితో ఓ యువతికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ స్నేహితులయ్యారు. దీంతో కొంచెం చనువుగా ఉన్నారు. అయితే, వీరిద్దరు చనువుగా తిరుగుతుండటం పట్ల ఆ యువతి ప్రియుడికి నచ్చలేదు. దీంతో ఆమెను హెచ్చరించాడు. అతను తన మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె తన ప్రియుడికి చెప్పింది. అయినా అతడు నమ్మలేదు. మరోసారి కూడా వారు కలిసి తిరగడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో ఓ రోజు అతడ్ని కిడ్నాప్, చేసి దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జయానగర్‌లో మృతుడు యోగేష్(26) తన అక్కతో కలిసి నివాసముంటున్నాడు. యోగేష్ స్వస్థలం మగాదిలోని అత్తింజర్ గ్రామం. అయితే కొద్ది సంవత్సరాల క్రితం యోగేష్ బెంగళూరుకు వచ్చాడు. అక్క దగ్గర ఉంటూ బెంగళూరులోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

కాగా, రోజూలాగానే జూలై 19న యోగేష్ ఆఫీస్‌కు వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. రెండు రోజులుగా తమ్ముడి జాడ తెలియకపోవడంతో యోగేష్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

All for love: Man arrested for kidnap and murder in Bengaluru

యోగేష్ కాల్‌డేటాను పరిశీలించారు. ఓ యువతి నంబర్‌కు ఎక్కువసార్లు ఫోన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ యువతిని పిలిపించి పోలీసులు విచారించారు. కాగా, ఆ యువతి యోగేష్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని విచారణలో తేలింది. మైసూర్‌కు చెందిన ఆ యువతి యోగేష్‌తో చనువుగా ఉండేది. ఆమెను కలిసేందుకు యోగేష్ మైసూర్ వెళ్లేవాడు.

రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకునేవారు. అయితే వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం ఆమె ప్రియుడు, నిందితుడు ప్రతాప్‌(27) కంటపడింది. యోగేష్‌తో చనువుగా ఉండొద్దంటూ ఆమెకు చెప్పాడు. కాగా, యోగేష్ కేవలం స్నేహితుడు మాత్రమేనని, తప్పుగా భావించొద్దని ఆమె ప్రతాప్‌కి చెప్పింది.

అయినా ప్రతాప్ ఆమె మాటలను విశ్వసించలేదు. ఆమెపై అనుమానం పెంచుకున్న ప్రతాప్.. యోగేష్‌‌‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో జులై 19న సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న యోగేష్‌ను మరో నలుగురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు ప్రతాప్.

యోగేష్‌ను ఓ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లిన ప్రతాప్.. ఇనుపరాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. నిందితుడు ప్రతాప్‌ను అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కాగా, ఈ హత్యలో యువతి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. నిందితుడికి సహకరించిన మరో నలుగురి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

English summary
The Jayanagar police have solved a kidnap and murder case and arrested the prime accused, identified as Pratap, 27, who has confessed to the crime. He told police that he was upset that the victim, identified as Yogesh, 26, was getting close to his girlfriend and thus eliminated him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X