రేపు 6 రాష్ట్రాల్లోని 7 సీట్లకు ఉపఎన్నికలు-ఇండియా కూటమి ఐక్యతకు తొలి పరీక్ష !

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమికి రేపు తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటివరకూ ఇండియా కూటమి సభ్యులు పాట్నా, బెంగళూరు, ముంబైలో మూడు భేటీలు పెట్టుకుని తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటుండగా.. ఇప్పుడు ఆ మాటలు చేతల్లో ఎలా ఉండబోతున్నాయో తేల్చే పరీక్ష ఎదురుకాబోతోంది. రేపు ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు జరిగే ఎన్నికలు ఇండియా కూటమికి కీలకంగా మారాయి.

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో రేపు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్ మరియు ధన్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్ధానాలు ఉన్నాయి.వీటిలో పశ్చిమబెంగాల్, యూపీలో ఇండియా కూటమి పక్షాలకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటివరకూ ఐక్యంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న ఇండియాకూటమి పార్టీలు ఈ రెండు చోట్ల ఏం చేయబోతున్నాయనేది తేలిపోనుంది.

All set for 7 by-polls in 6 states tomorrow, test for INDIA blocs contradictions

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసి స్ధానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇండియా కూటమి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుండగా.. ఎస్పీ నుంచి బీజేపీలోకి మారిన మాజీ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీలు అభ్యర్ధుల్ని పోటీలో పెట్టలేదు. ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో జరుగుతున్న ద్విముఖ పోరులో ఇండియాకూటమి పార్టీ అయిన ఎస్పీకి కాంగ్రెస్ నుంచి ఎంత సహకారం లభిస్తుందన్నది తేలాల్సి ఉంది.

అలాగే పశ్చిమబెంగాల్ లోని ధూప్ గురి స్ధానంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఉపఎన్నికల పోరు జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి ఇక్కడ తృణమూల్ అభ్యర్ధికి మద్దతు లభించాల్సి ఉంది. ఈ విషయంలో లెఫ్ట్, కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. ఇలా యూపీ, బెంగాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇండియా కూటమి బీటలు వారడం ఖాయం. దీంతో అందరి దృష్టీ రేపటి ఉపఎన్నికలపై నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+