వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ టైమ్ రికార్డ్: పలు పట్టణాల్లో రూ.100 ప్లస్: లిస్ట్ ఇదే: 9 రోజుల్లో ఏడుసార్లు మోత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఆకాశానికి ఎగబాకాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు.. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి బుధవారం నాటికి ఏడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 8,9 తేదీల్లో మాత్రమే వాటి జోలికి వెళ్లలేదు. సోమవారం నుంచి మళ్లీ ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటూ వచ్చింది. దానికి బ్రేకులు పడట్లేదు. తాజా పెంపు ప్రభావంతో అనేక పట్టణాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటింది పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది. ఇక్కడితో దీనికి అడ్డుకట్ట పడుతుందనే గ్యారంటీ లేదు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 22 నుంచి 25 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 24 నుంచి 27 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.05, డీజిల్ 82.61 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 98.36 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 89.75 పైసలకు చేరింది.

చెన్నైలో పెట్రోల్ రూ. 93.84, డీజిల్‌ ధర రూ. 87.49, కోల్‌కతలో పెట్రోల్ రూ.92.16 పైసలు, డీజిల్‌ ధర రూ.85.45 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-95.11, డీజిల్-87.57, హైదరాబాద్‌లో పెట్రోల్-95.67, డీజిల్ 90.06, భోపాల్‌లో లీటర్ పెట్రోల్-100.08, డీజిల్-90.95, పాట్నాలో పెట్రోల్-94.28, డీజిల్ 87.84, లక్నోలో పెట్రోల్-89.96, డీజిల్-82.99, గురుగ్రామ్‌లో పెట్రోల్-89.96, డీజిల్-83.19గా నమోదైంది.

All time High: Petrol, Diesel Prices again increased; Bhopal crosses Rs100, check rates here

భోపాల్‌లో వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్క్‌ను దాటింది. అక్కడ రూ.100.73 పైసలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్‌లో లీటర్ పెట్రోల్ 103 రూపాయలను దాటింది.

Recommended Video

Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 103.21 పైసలుగా నమోదైంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ 102.96 పైసలకు చేరింది. దేశం మొత్తం మీద ఈ రెండు ప్రాంతాల్లో పెట్రోల్ రేటు అత్యధికంగా రికార్డయింది. మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. అనూప్‌పూర్‌లో 102.66, రీవాలో 102.30, ఛింద్వాడలో 101.93 పైసలు పలుకుతోంది.

English summary
Petrol price was raised by 22-25 paise a litre and diesel by 24-27 per litre across the country. After fresh hike Petrol prices in Bhopal at Rs 100.08, diesel at Rs 90.05 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X