యూపీ ముస్లింలకు అలహాబాద్ హైకోర్టు షాక్- ప్రాథమిక హక్కేమీ కాదని పిల్ తిరస్కరణ

యూపీలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక లౌడ్ స్పీకర్ల వాడకంపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులతో పాటు అన్ని ప్రార్ధనా స్ధలాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. అంతే కాదు లౌడ్ స్పీకర్ల వాడకం విషయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వాడకం ప్రాధమిక హక్కుల్లో భాగమంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు అది తప్పని తెలిపింది. జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ వికాస్‌లతో కూడిన అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తన ఉత్తర్వుల్లో మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం రాజ్యాంగ హక్కు కాదని చట్టం చెబుతోందని పేర్కొంది. ఇర్ఫాన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ డిసెంబర్ 3, 2021న బదౌన్ జిల్లాకు చెందిన బిసౌలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేసింది. ఆజాన్ కోసం ధోరన్‌పూర్ గ్రామంలోని నూరి మసీదు వద్ద లౌడ్ స్పీకర్‌ను ఏర్పాటు చేయడానికి మెజిస్ట్రేట్ గతంలో అనుమతి నిరాకరించారు. .

allahabad hc rejects installation of loud speakers in mosques, says not fundamental right

మెజిస్ట్రేట్ ఉత్తర్వు చట్టవిరుద్ధం, ఇది ప్రాథమిక హక్కులు, చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తుందంటూ పిటిషనర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం దీన్ని తోసిపుచ్చింది. వాస్తవానికి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వివాదం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో చెలరేగింది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల శబ్దం ప్రాంగణం వెలుపల వినిపించకూడదని అన్నారు.

యూపీ సర్కార్ అనుమతితో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే ప్రాంగణం నుండి శబ్దం బయటకు రాకూడదని యోగీ తెలిపారు.లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రకటన తరువాత, రాష్ట్రంలోని 17,000 మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ రాష్ట్రంలోని దేవాలయాలు, మసీదులతో సహా అన్ని మతపరమైన ప్రదేశాలకు నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+