వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్‌తో జయంత్ సింగ్: యూపీలో ఎస్పీ-ఆర్ఎల్డీ పొత్తు, త్వరలోనే సీట్ల షేరింగ్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న క్రమంలో రాజకీయ పార్టీలు కొత్త పొత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) పొత్తు కుదిరింది. ఈ మేరకు ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ సింగ్ చౌదరి సోషల్ మీడియాలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో దిగిన ఫొటోను పోస్టు చేసి పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.

లక్నోలో అఖిలేష్ యాదవ్‌ను కలిసిన అనంతరం జయంత్ సింగ్ చౌదరి మాట్లాడుతూ.. త్వరలోనే తమ పార్టీల పొత్తుపై అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
అఖిలేష్ యాదవ్ పార్టీతో సీట్ల పంపకం తుది దశకు వచ్చిందని తెలిపారు. బీజేపీతో వెళ్లే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని జయంత్ సింగ్ తేల్చి చెప్పారు.

Alliance Done: Rashtriya Lok Dal Chief Shares Pic With Akhilesh Yadav

అఖిలేష్ యాదవ్ కూడా జయంత్ సింగ్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్ఎల్డీ పార్టితో కలిసి మార్పు వైపు ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న క్రమంలో సమాజ్ వాదీ పార్టీ ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకుంది. మరిన్ని కలిసివచ్చే పార్టీలను భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉంది.

కాగా, ఈ రెండు పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి పోటీ చేశాయి. వెస్టర్న్ యూపీ సీట్లను జాట్, ముస్లింలకు కేటాయించేందుకు ఈ పార్టీలు భావిస్తున్నాయి. 2013 మత ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత ఈ రెండు వర్గాలు దూరం పెరిగి, బీజేపీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల రైతుల నిరసనలతో ఈ రెండు కమ్యూనిటీ ఇప్పుడు కలిసిపోయాయని, ఇది అఖిలేష్, జయంత్ సింగ్ పార్టీలకు కలిసి వచ్చే అంశమవుతుందని చెబుతున్నారు.
అయితే, ఈ పరిణామాలను ఈ రెండు పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటాయా? లేదా? అనేది ఎన్నికల్లోనే తెలుస్తుంటున్నారు. 30-50 సీట్లను ఆర్ఎల్డీకి కేటాయించేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Special Report on Trs Party Flag Festival | Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలుండగా.. పశ్చిమ యూపీలో 100 సీట్ల వరకు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 100 సీట్లలో 76 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఓపీనియన్ పోల్స్ కూడా బీజేపీకి మరోసారి అధికారం ఖాయమని చెబుతున్నాయి. అయితే, సీట్లు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

English summary
Alliance Done: Rashtriya Lok Dal Chief Shares Pic With Akhilesh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X