వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్సీపీ-కాంగ్రెస్‌తో వద్దు! బీజేపీతో కలవండి: ఉద్ధవ్ థాక్రేకు తేల్చేసిన ఏక్‌నాథ్ షిండే

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభనపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేతకు కీలక సూచనలు చేశారు. శివసేన నాయకుడు మిలింద్ నార్వేకర్ మంగళవారం గుజరాత్‌లోని సూరత్‌లో విడిది చేసిన ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు.

బీజేపీతో కలవాలంటూ ఉద్ధవ్ థాక్రేకు ఏక్‌నాథ్ షిండే

బీజేపీతో కలవాలంటూ ఉద్ధవ్ థాక్రేకు ఏక్‌నాథ్ షిండే

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో మిలింద్ నార్వేకర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రేతో ఏక్‌నాథ్ షిండేను ఫోన్‌లో మాట్లాడించినట్లు సమాచారం. తన వద్ద 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారని, ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉంటే, శివసేన పార్టీలో చీలిక ఉండదని ఆ వర్గాలు తెలిపాయి.

ఏక్‌నాథ్ షిండే అలా.. ఉద్ధవ్ థాక్రే ఇలా

ఏక్‌నాథ్ షిండే అలా.. ఉద్ధవ్ థాక్రే ఇలా

తాను సీఎం పదవిపై దృష్టి పెట్టడం లేదని, అతనిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ఉద్ధవ్ థాక్రేతో ఏక్‌నాథ్ షిండే చెప్పారని ఆ వర్గాలు తెలిపాయి (శివసేన సీఎల్‌పి నాయకుడిగా ఏక్‌నాథ్ షిండే తొలగించబడ్డారు. మరోవైపు శివసేన పదాన్ని తన ట్విట్టర్ బయో నుంచి తొలగించారు ఏక్‌నాథ్ షిండే). తనకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ప్రదర్శనలు చేయడం పట్ల ఏక్‌నాథ్ షిండే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. శివసేన నేతలు, కార్యకర్తలను బీజేపీ వేధింపులకు గురిచేస్తోందని సీఎం ఉద్ధవ్ థాక్రే.. ఏక్‌నాథ్ షిండేతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బీజేపీ దుర్మార్గంగా వ్యవహరించిందంటూ ఉద్ధవ్ థాక్రే.. షిండే ఇలా

బీజేపీ దుర్మార్గంగా వ్యవహరించిందంటూ ఉద్ధవ్ థాక్రే.. షిండే ఇలా

బీజేపీతో పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే.. గతంలో కూడా శివసేన పట్ల కాషాయం పార్టీ దుర్మార్గంగా ప్రవర్తించిందని ఏక్నాథ్ షిండేతో అన్నారు.
ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. నిర్ణయం తనదేనని, సూరత్‌లోని ఎమ్మెల్యేలకు శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో సమస్య ఉందని సీఎంకు చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతారా? లేదా అనేది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. సీఎం, పార్టీ అధినేత చర్చలు జరిపినప్పటికీ ఇంకా రెబల్ ఎమ్మెల్యేలు తమ వాదనపైనే బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బాలా సాహెబ్ బలమైన సైనికులం, మోసం చేయమంటూ షిండే

'మేం బాలా సాహెబ్‌కు చెందిన బలమైన సైనికులం. ఆయన మాకు హిందుత్వను నేర్పించారు. బాలాసాహేబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తోన్న మేం అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం' అంటూ ఏక్‌నాథ్ షిండే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ట్వీట్ చేసిన గంట సేపటికే ట్విట్టర్ బయోలో శివసేన అనే పదాన్ని తొలగించారు షిండే. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో శివసేన ప్రభుత్వం నడపడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary
Ally with BJP, Sena MLAs against NCP-Congress alliance: Eknath Shinde tells Uddhav Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X