Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"చర్యకు ప్రతిచర్య, దేవుడే చేయించాడు"-సీజేఐపై దాడిని సమర్ధించుకున్న లాయర్..!

నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏకంగా ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై షూ విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాజేష్ కిషోర్ మరో షాకిచిచ్చాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగాడు. తన చర్యను సమర్దించుకోవడంతో పాటు అందుకు మద్దతుగా పలు విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తున్నాడు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

సనాతన ధర్మాన్ని ఎగతాళి చేశారంటూ ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై నిన్న షూ విసిరిన లాయర్ రాజేష్ కిషోర్ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఆ పని తాను చేయలేదని, దేవుడే చేయించాడంటూ వ్యాఖ్యానించారు. ఇది దేవుడి ఆదేశం అన్నాడు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నాడు. ఈ మేరకు విచారణలో అతను పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిన్న కోర్టు గదిలోనే సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే ఊరుకునేది లేదంటూ రెచ్చిపోయిన లాయర్.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని సైతం సమర్ధించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Almighty s order Lawyer defends shoe toss at Chief Justice Br Gavai

మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం కావడంతో, దీన్ని పునర్ నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ బీఆర్ గవాయ్ దాన్ని తిరస్కరించారు. ఈ సందర్భంగా మీ దేవుడినే ఏదో ఒకటి చేయాలని అడగాలని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో గతంలోనే సీజే క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Almighty s order Lawyer defends shoe toss at Chief Justice Br Gavai

ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీజేఐ గవాయ్ ను బీజేపీ, పలు హిందూ సంస్థల కార్యకర్తలు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ఈసారి ఏకంగా ఛీఫ్ జస్టిస్ పైనే అదీ కోర్టు హాల్లోనే షూ విసిరిన ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈ ఘటనను ఇప్పటికే విపక్ష పార్టీలతో పాటు ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు ఖండించారు. అయినా ఈ కలకలం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+