వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్: ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్.. ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టగా తీసుకుని విస్తృత ప్రచారం చేశాయి. మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆరాటపడగా, ఎలాగైనా విజయఢంకా మోగించాలని కాంగ్రెస్ తీవ్ర పోరాటమే చేసింది. ఇందుకు సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి.

బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓబీసీ నేతలైన జిగ్నేశ్ మేవానీ, అల్పేష్ ఠాకూర్‌లను ఉపయోగించుకుంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున వారిద్దరూ గుజరాత్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. వీరిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన స్థానాల్లో మరిన్ని స్థానాలు చేరాయని చెప్పడం సందేహం లేదు.

ఆధిక్యంలో మేవానీ..

ఆధిక్యంలో మేవానీ..

గుజరాత్ రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన రాధాన్పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసిన అల్పేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తనకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో స్థానిక కాంగ్రెస్ నేత లావింగ్జీ ఠాకూర్ బీజేపీలో చేరారు. ఈయనే అల్పేష్‌కి ప్రత్యర్థి కావడం గమనార్హం.

మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు

మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు

ఎన్నికల ప్రచారంలో అల్పేశ్ ఠాకూర్.. ప్రధాని మోడీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం. మోడీ తన అందం కోసం తైవాన్ నుంచి పుట్టగొడుగులను తెప్పించుకుని తింటున్నాడని, వాటి ధర ఐదింటికి రూ. 4లక్షలని అన్నారు. అయితే, ఆ తర్వాత అల్పేశ్‌కు ఓ తైవాన్ యువతి కౌంటర్ ఇచ్చింది. అలాంటి పుట్టగొడుగులు తమ దేశంలో లేవని, పుట్టుగొడుగులు తింటే అందంగా తయారవడం అసాధ్యమని తేల్చి చెప్పింది. అంతేగాక, మీ రాజకీయాల్లో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారంటూ నిలదీసింది.

కాంగ్రెస్ ప్లాన్ అమలు

కాంగ్రెస్ ప్లాన్ అమలు

30శాతం జనభా ఉన్న ఓబీసీల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అల్పేష్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీలను తమ పార్టీకి మద్దతిచ్చేలా చేసుకుంది. దీంతో దళిత యువనేత అయిన జిగ్నేశ్ మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేద్గామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేవానీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో జిగ్నేష్ విజేతగా నిలిచారు.

ఆ ముగ్గురితోనే లాభమే

ఆ ముగ్గురితోనే లాభమే

కాగా, పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మేవానీ, అల్పేష్ తోపాటు హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రచారం నిర్వహించారు. వీరి ముగ్గురి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరగా రాగలిగిందని చెప్పవచ్చచు. కాగా, ఎన్నికల ఫలితాల ముందు రోజు అంటే ఆదివారం మేవానీ మాట్లాడుతూ.. బీజేపీ గెలుస్తుందని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని అవాస్తవాలేనని అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.

అంత చేసినా..

అంత చేసినా..

ఇదిఇలావుంటే.. సోమవారం వెలువడుతున్న ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. ఉదయం 12గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బీజేపీ 110స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 70స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 182అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో మేజిక్ ఫిగర్ 92స్థానాలు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.

English summary
Jignesh Mevani and Alpesh Thakor, two key hopes for the Congress in Gujarat, were ahead in early leads as votes were counted in the crucial state. Alpesh Thakor, 40, was trailing initially but picked up soon to take a lead in Radhanpur, one of the largest constituencies in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X