ఈ రైళ్లు ఎక్కాలంటే ‘అదృష్టం’ కూడా ఉండాలి!
దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం కోసం వందలాది రైళ్లు తిరుగుతుంటాయి. భారతీయ రైల్వే వీటిని నిర్వహించడానికి ఎంతో శ్రమిస్తుంది. ఎంత చేసినప్పటికీ కొన్ని రైళ్లు మాత్రం ఎప్పుడూ మురికి కంపు కొడుతూనే ఉంటాయి. రైల్వేకు వీటి గురించి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయి. రాబోయే రోజుల్లో ఈ రైళ్లల్లో ప్రయాణం చేయాలనుకుంటే వాటిగురించి ఒకసారి తెలుసుకోవడం ఉత్తమం.
అత్యంత మురికి కంపు కొట్టే రైళ్ల జాబితాలో ప్రథమ స్థానాన్ని సహర్స-అమృతసర్ గరీబ్ రథ్ కొట్టేసింది. ఈ రైలులో అపరిశుభ్ర వాతావరణంపై ఇప్పటికే రైల్వేకు అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కోచ్ నుంచి టాయిలెట్ వరకు మొత్తం మురికిగా ఉంటుంది. క్యాబిన్, టాయిలెట్ సీట్, కోచ్ నుంచి సింక్.. ఇలా మొత్తం మురికిగానే కనపడుతూ అపరిశుభ్రతలో ప్రథమస్థానాన్ని దక్కించుకుంది.

జోగ్బానీ-ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు, శ్రీ మాతా వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు, బాంద్రా-శ్రీ మాతా వైష్ణో దేవి స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఫిరోజ్‌పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్, ఆనంద్ విహార్-జోగ్బానీ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్ క్లోన్ స్పెషల్ ట్రైన్, అజ్మీర్-జమ్ము తావి పూజ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ తోపాటు పలు రైళ్లపై అనేక ఫిర్యాదులు అందుతుంటాయి.
అపరిశుభ్రతపై 1000కి పైగా ఫిర్యాదులు అందాయి. తూర్పు భారతదేశానికి తిరిగే రైళ్ల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కంపు కొట్టే మురికి రైళ్లల్లో టాప్ 10లో 7 రైళ్లు తూర్పు భారతదేశానికి తిరిగేవే. ముంబయి నుంచి మాతా వైష్ణో దేవి కాట్రా వెళ్లే రైళ్లు కూడా మురికి మురికిగా కనపడుతుంటాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో కూడా అపరిశుభ్రతపై ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సేవలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications