షాక్ : లండన్ కు అమర్ సింగ్, అఖిలేష్ దే పై చేయి

చికిత్స కోసం లండన్ కు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకొన్నట్టుగా సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి తర్వాత ఇండియాకు తిరిగి రానున్నట్టు ఆయన ప్రకటించారు.

లక్నో :సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది మార్చి వరకు ఆయన లండన్ లోనే గడపనున్నారు. చికిత్స కోసం ఆయన లండన్ ను వెళ్ళనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికలు జరిగే సమయంలో అమర్ సింగ్, శివపాల్ ను పార్టీకి దూరంగా ఉంచాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డిమాండ్ చేసిన నేపథ్యంలో అమర్ సింగ్ తీసుకొన్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకొంది.

జైలు శిక్ష పడకుండా కాపాడాడు, ప్రధానిని చేస్తాడు, కొడుకును కాదని అమర్‌పై ప్రేమ

సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభానికి అమర్ సింగ్ ప్రధాన కారణమని ఉత్తర్ ప్రదేశం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తండ్రి తనయుల మద్య అగాధానికి అమర్ సింగ్ కారణంగా అఖిలేష్ సన్నిహితులు చెబుతున్నారు.

ఆశ్చర్యం: బుందేల్ ఖండ్ నుండే అఖిలేష్ ఎందుకు పోటీచేయాలనుకొంటున్నాడు?

సమాజ్ వాదీ పార్టీలో నెలన్నర రోజులుగా సంక్షోభం కొనసాగుతోంది. ఈ సంక్షోభం సమసిపోయినట్టుగానే కన్పించినా ములాయం,అఖిలేష్ ల మద్య అగాధం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సమాజ్ వాదీ సై, అఖిలేష్ కొత్త పార్టీ?

తండ్రి తనయులు పలు దఫాలు చర్చించారు.అయితే ఈ చర్చల్లో సానుకూలమైన ఫలితాలు రాలేదు. అయితే ఎన్నికల గుర్తు కోసం ఇరువురు కూడ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

సైకిల్ పై సవారీ ఎవరిదో , ములాయంపై అఖిలేష్ పై చేయి సాగేనా?

అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం

అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఇండియాకు దూరంగా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ నిర్ణయం తీసుకొన్నారు. మార్చి 17 తర్వాత యూపిలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే యూపి ఎన్నికల సమయంలో పార్టీకి వ్యవహరాలకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ దూరంగా ఉండాలని యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ వద్ద ప్రతిపాదించాడు.అయితే ఈ ప్రతిపాదనల పట్ల ములాయం సింగ్ సానుకూలంగా స్పందించలేదని సమాచారం. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి వరకు లండన్ లోనే గడపాలని అమర్ సింగ్ నిర్ణయం తీసుకొన్నారు. చికిత్స కొసమే తాను లండన్ వెళ్తున్నట్టుగా అమర్ సింగ్ ప్రకటించారు.

 పార్టీ ఆహ్వనం మేరకే ఇండియాకు

పార్టీ ఆహ్వనం మేరకే ఇండియాకు

సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో ములాయం సింగ్ నుండి వచ్చిన పిలుపు మేరకు లండన్ లో ఉన్న అమర్ సింగ్ హుటాహుటిన ఇండియాకు తిరిగి వచ్చాడు. జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నికైన తర్వాత అమర్ సింగ్ లండన్ నుండి తిరిగి ఇండియాకు వచ్చాడు. అయితే ములాయంతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అఖిలేష్ మాత్రం తన పట్టును వీడని కారణంగా అమర్ సింగ్ అర్థాంతరంగా లండన్ వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్సి మద్యలోనే పార్టీ కోసం రావాల్సి వచ్చింది. చికిత్సను పూర్తి చేసుకొన్న తర్వాత ఇండియాకు తిరిగి వస్తానని అమర్ సింగ్ ప్రకటించారు.

అఖిలేష్ దే పై చేయి

అఖిలేష్ దే పై చేయి

తండ్రి తనయుల మద్య సాగుతున్న ఆదిపత్యపోరులో అఖిలేష్ పై చేయి సాధిస్తున్నాడు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అత్యధిక నాయకులు అఖిలేష్ వైపే నిలిచారు. సిట్టింగ్ ఎంపిలు, ఎంఏల్ఏలు, ఎంఏల్ సిలలో కూడ మెజార్టీ నాయకులు అఖిలేష్ వైపే ఉన్నారు. నామమాత్రమైన నాయకులు, ప్రజా ప్రతినిధులు ములాయం సింగ్ యాదవ్ వైపు నిలిచారు. ఎన్నికల గుర్తు కోసం పార్టీ నాయకుల అఫిడవిట్లలో అఖిలేష్ వర్గమే ఎక్కువగా దాఖలుచేసింది. అమర్ సింగ్ ను లండన్ వెళ్ళాలని తీసుకొన్న నిర్ణయం కూడ మరోసారి అఖిలేష్ దే పై చేయి గా నిలుస్తోందనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికలతర్వాతే ఇండియాకు అమర్ సింగ్

ఎన్నికలతర్వాతే ఇండియాకు అమర్ సింగ్

ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుండి మార్చి నాలుగవ తేది వరకు ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నికలు అయ్యాకే అమర్ సింగ్ ఇండియాకు తిరిగి రానున్నాడు. అమర్ సింగ్ ఇండియాకు తిరిగి వచ్చేనాటికి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. అఖిలేష్ కోరుకొన్నది కూడ ఇదే. ఎన్నికలు అయ్యే సమయంలో అమర్ సింగ్, శివపాల్ పార్టీ వ్యవహరాల్లో దూరంగా ఉండాలనేది అఖిలేష్ వ్యూహం. ఈ వ్యూహం సక్సెస్ అయితే తాను అనుకొన్నట్టుగానే ఎన్నికలను నిర్వహించుకొనే అవకాశం దక్కనుందని ఆయన భావిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+