'అమరనాథ్' దాడి: సూత్రధారి అబూ ఇస్మాయిల్ హతం, మూడే నిమిషాల్లో ముగించేశారు

Subscribe to Oneindia Telugu
Amarnath Yatra : Abu Ismail Spotted, cornered And trapped 'అమరనాథ్' దాడి సూత్రధారి హతం

శ్రీనగర్: అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ హతమయ్యాడు. శ్రీనగర్‌ శివారులోని నౌగమ్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇస్మాయిల్‌తో పాటు, అతని సహచరుడు చోటా అలియాస్, అబూ కాసింను మట్టుబెట్టాయి.

మొత్తం ఆపరేషన్ ను కేవలం మూడు నిమిషాల్లోనే భద్రతా బలగాలు ముగించినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తో సిద్దమైనందువల్లే ఇంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేయగలిగారని తెలుస్తోంది. ఇందుకోసం స్థానికుల నుంచి కూడా సహాయం తీసుకున్నట్లు సమాచారం.

Amarnath yatra attack: Abu Ismail spotted, cornered, trapped, killed in 3 mins

కాగా, ఈ ఏడాది జులై 11న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో అబూ ఇస్మాయిల్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆ దాడిలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. జ‌మ్ముకశ్మీర్‌లో భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల చేతిలో హతమైన టాప్ ఉగ్రవాదుల్లో ఇస్మాయిల్ నాలుగవ వాడు కావడం గమనార్హం.

కొన్ని నెల‌ల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడ‌ర్ బుర్హాన్ వ‌నీ, మ‌రో టాప్ లీడ‌ర్‌ స‌బ్జ‌ర్ భట్‌ను కూడా భారత భద్రతా బలగాలు హ‌త‌ం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగ‌స్టులో ఎల్ఈటీ క‌మాండ‌ర్ అబు దుజానాని కూడా భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Spotted, cornered, trapped and killed in 3 minutes. This is how one could summarise the operation that led to the killing of Abu Ismail
Please Wait while comments are loading...