దేశీ ఐటీకి అమెజాన్ తీపి కబురు: వెయ్యికి పైగా కొత్త ఉద్యోగాలు.. ఎక్కడ ఎన్ని?

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మారుతున్న టెక్నాలజీ.. ఆటోమేషన్ ప్రభావంతో చాలామంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పని తీరు సరిగా లేదన్న కారణంతో కొన్ని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా వారిని బయటకు పంపించేస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు కష్టకాలం: డిమాండ్ కొత్త టెక్నాలజీకే.. నేర్చుకోవాలంటే లక్షల్లో ఫీజులు

ఉన్న ఉద్యోగాల్లో కోతలే తప్పించి.. కొత్త ఉద్యోగాల కల్పన కష్టమనుకుంటున్న తరుణంలో.. అమెజాన్ ఇప్పుడో శుభవార్త చెప్పింది. దేశీయంగా ఉన్న తమ సంస్థల్లో వెయ్యికి పైగా కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలపింది. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది.

నైపుణ్యం ఉన్నవారికే:

నైపుణ్యం ఉన్నవారికే:

అమెజాన్.కామ్, అమెజాన్.ఇన్ డివైజ్‌ల బిజినెస్‌లలో రీసెర్చ్&డెవలప్ మెంట్‌కు , క్లౌడ్ కంప్యూటింగ్ డివిజిన్ అమెజాన్ వెబ్ సర్వీసుల్లో ఈ నియామకాల ప్రక్రియ చేపట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. సంబంధిత టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారినే సంస్థలోకి తీసుకోవాలని యోచిస్తోంది.

Amazon Great Indian Sale 2017 Up to 50 Percent Discounts and Cashbacks
1,245ఉద్యోగాలు:

1,245ఉద్యోగాలు:

అమెజాన్ సంస్థ వెబ్ సైట్ లోని కెరీర్స్ పేజీలో భారత్ లో 1,245స్థానాలను బుధవారం లిస్టవుట్ చేసింది. ఈ నియమాకాల ప్రక్రియ త్వరలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్ సంస్థకు దేశంలో 50వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత అమెజాన్ రెండో అతిపెద్ద వర్క్ ఫోర్స్ సెంటర్ భారత్ కావడం విశేషం.

ఇవీ ఉద్యోగాలు:

ఇవీ ఉద్యోగాలు:

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 3,41,000మంది సేవలు అందిస్తున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు, డేటా అనలిటిక్స్ లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ వంటి టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్నవారి కోసం అమెజాన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏయే యూనిట్స్‌లో ఎన్ని?:

ఏయే యూనిట్స్‌లో ఎన్ని?:

తాజాగా చేపట్టనున్న 1,245ఉద్యోగాల్లో.. దేశంలోనే అత్యంత లాభదాయకమైన అమెజాన్ యూనిట్ ఏడబ్ల్యూఎస్ 195మందిని, బెంగుళూరు యూనిట్ లో 557మందిని, హైదరాబాద్-403, చెన్నై యూనిట్-149మందిని నియమించుకోవాలని చూస్తున్నట్లు సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ దలే వాజ్ తెలిపారు.

కాగా, దేశంలో బెంగళూరు యూనిట్ అమెజాన్ కు అతిపెద్దది. కిండ్లీ, ఫైర్ లాంటి డివైజ్ లపై చెన్నై సెంటర్ ఎక్కువగా ఫోకస్ చేసింది. అమెరికా మినహా మిగతా అన్ని సెంటర్ లలో కెల్లా బెంగళూరులోనే అమెజాన్ ఎక్కువ రిక్రూట్‌మెంట్స్ చేపడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amazon is looking to hire over 1,000 people, mostly software professionals, in India. The hires will cater largely to research and development for the company's divisions, including Amazon.com, Amazon.in, the devices business, and the cloud-computing division, Amazon Web Services (AWS).
Please Wait while comments are loading...