అమెజాన్ ప్రైమ్‌డే సేల్: స్మార్ట్‌ఫోన్లు, టివిలపై బంపర్ఆఫర్లు

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగకు తెరలేపబోతోంది. తనతొలి ప్రైమ్‌డే సెల్‌ను ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు భారత్‌లో ప్రారంభించబోతోంది.

న్యూఢిల్లీ: ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగకు తెరలేపబోతోంది. తనతొలి ప్రైమ్‌డే సెల్‌ను ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు భారత్‌లో ప్రారంభించబోతోంది. 12 ప్రపంచదేశాలతోపాటు భారత్‌లోనూ ఈ స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ కామర్స్ కంపెనీలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్ 30 గంటలపాటు ఈ సేల్‌ను నిర్వహిస్తోంది.

మంగళవారంనాడు అర్దరాత్రివరకు ఈ సేల్ కొనసాగుతోంది. అయితే రూ.499తో ప్రైమ్‌చందాదారులుగా చేరినవారికే మాత్రమే ఈ సేల్‌లో ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ఆఫర్లు క్యాష్‌బ్యాక్‌లు వివిద దేశాల్లో భిన్నంగా ఉండనున్నాయి.

ఇండియాతోపాటు ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం , జపాన్‌లున్నాయి. గతేడాది అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ చేసింది. ఈసారి భారత్‌లో కూడ ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్

షియోమిలవర్స్ ఫేమస్ ఫోన్ రెడ్‌మి 4ను ఓపెన్ సేల్ కింద ఇవాళ సాయంత్రం 5 గంటలనుండి అందుబాటులో ఉంచనున్నారు.అది ఎక్స్‌క్లూజివ్‌గా తన ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. అంతేకాక వన్‌ప్లస్ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 5 స్మార్ట్‌పోన్ కొనుగోలుపై రూ.2వేలవరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నారు. ఈ ఆఫర్ కేవలం డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకొన్నవారికే ఇప్పటికే వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేసిన వారికి 19 వేల రూపాయాల తగ్గింపును అమెజాన్ అందిస్తోంది.

హెచ్‌డిసిఎఫ్ బ్యాంక్ యూజర్లకు మరో రూ.2 వేలు

హెచ్‌డిసిఎఫ్ బ్యాంక్ యూజర్లకు మరో రూ.2 వేలు

హెచ్‌డిఎస్ఎఫ్ బ్యాంక్ కార్డు యూజర్లకు మరో రూ. రెండువేల రూపాయాల తగ్గింపును ప్రకటించింది. మోటోఫోన్లపై రూ.వెయ్యి తగ్గింపును హానర్ 6 ఎక్స్ స్మార్ట్‌ఫోన్లపై రూ.3వేల తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. కిచెన్ హోమ్ అప్లయిన్స్‌పై 45 శాతం తగ్గింపును ఇస్తోంది.

వస్త్రాలపై 70శాతం తగ్గింపు

వస్త్రాలపై 70శాతం తగ్గింపు

అమెజాన్ ఫైర్‌టివి స్టిక్ ధరను వెయ్యిరూపాయాల వరకు తగ్గించనున్నట్టు అమెజాన్ తెలిపింది. అంతేకాక రూ.499 రూపాయాల క్యాష్‌ను ఇవ్వనున్నట్టు చెప్పింది. ఫిట్‌బిట్ ఫిట్‌నెస్ ట్రాక్టర్లపై 40 శాతం, వస్త్రాలపై స్విగ్గీ ఫుడ్ డెలివరీపై రూ. 150 తగ్గింపు, బుక్‌మై ‌షోలో మూవీ టిక్కెట్లను కొనుగోలుచేసిన వారికి రూ.200 తగ్గింపు వంటి పలు డీల్స్‌ను ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులతో కొనేవారికి 15శాతం క్యాష్‌బ్యాక్‌‌ను కస్టమర్లకు అందించనున్నారు. ఇవేకాకుండా మరెన్నో డీల్స్ ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయని అమెజాన్ ప్రతినిధులు చెప్పారు. 30 కొత్త బ్రాండ్‌లను కూడ సేల్‌లో లాంచ్ చేయనున్నారు.

బై‌వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లు

బై‌వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లు

ఆన్‌లైన్ రీటైలర్ అమెజాన్‌ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించనుంది. ప్రైమ్‌ సేల్‌లో 20 టాప్ బ్రాండ్లతో‌పాటు అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనున్నామని అమెజాన్ ప్రైమ్‌హెడ్ అక్షయ్‌ సాహీ చెప్పారు. టిసిఎల్ టెలివిజన్ సెట్లలో మరో బైవన్ గెట్ వన్ ఫ్రీ ఒప్పందాన్ని కుదుర్చుకొంది. దీని ప్రకారం ప్రైమ్ వినియోగదారులు 4 కే ప్యూర్ అండ్రాయిడ్ స్మార్ట్‌టివి పై టిసిఎల్ హెచ్‌డీ రెడీ టివిని ఉచితంగా అందిస్తోంది. భారత్‌తోపాటు మరో 12 దేశాల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+