Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెయిల్స్ రద్దుపై సుప్రీంకోర్టుకు కీలక సిఫార్సులు-జగన్, సాయిరెడ్డి కేసుల్లో తీర్పు వేళ-అవి అమలైతే ?

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తును ఏడాదిలోగా పూర్తి చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. తాజాగా ఈ ప్రక్రియ వేగవంతం చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే కోర్టు సహాయకుడిగా (అమికస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియాను కూడా నియమించింది. ఆయన తాజాగా సుప్రీంకోర్టుకు సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు, నిందితుల బెయిల్, దాని రద్దు వంటి అంశాలపై కీలక సిఫార్సులు చేశారు. ఏఫీలో సీఎం జగన్ తో పాటు వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఈ సిఫార్సులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ

ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణ నానాటికీ ఆలస్యం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు.. గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులకూ వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏడాదిలోగా తమ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన అన్ని సీబీఐ, ఈడీ కేసుల విచారణలను ఫాస్ట్ ట్రాక్ ద్వారా పూర్తి చేయాలని గడువు పెట్టింది. దీంతో సహజంగానే అప్పటికే ఈ కేసుల్లో ఇరుక్కున్న వారంతా మరోసారి ఇరుకునపడ్డారు. ఈ కేసుల వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్ సైట్లలో పెట్టకపోవడంపైనా ఇప్పటికీ సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది.

 చర్యలకు సిఫార్సులు కోరిన సుప్రీంకోర్టు

చర్యలకు సిఫార్సులు కోరిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా పలు సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వ్యవహారం తేల్చేందుకు ఏడాది గడువు పెట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు ఈ కేసుల విచారణ వేగవంతంగా సాగేందుకు మార్గదర్శకాలు ఖరారు చేయబోతోంది. ఇందుకోసం సుప్రీంకోర్టు తనకు ఈ విషయంలో సూచనలు చేసేందుకు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియాను అమికస్ క్యూరీగా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారంపై అధ్యయనం చేసిన హన్సారియా తాజాగా తన సిఫార్సులను సుప్రీంకోర్టుకు అందజేశారు. ఇవి ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా బెయిళ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్న వారు, సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ఈ సిఫార్సులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉన్నాయి.

 అమికస్ క్యూరీ సిఫార్సులివే

అమికస్ క్యూరీ సిఫార్సులివే

సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ఫాస్ట్ ట్రాక్ విచారణల నిర్వహణ, వారికి బెయిళ్ల మంజూరు, రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియీ కీలక సిఫార్సులు చేశారు. ఇందులో ప్రధానంగా సీబీఐ, ఈడీ కేసుల్లో జాప్యం జరగకుండా పలు సిఫార్సులు చేశారు. దిగువ కోర్టుల్లో ఈ కేసుల విచారణ జాప్యానికి కారణాలు, వాటిని వేగవంతం చేసేందుకు కూడా సిఫార్సులు ఉన్నాయి. ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తయి విచారణ దశలో ఉంటే అలాంటి కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని సూచించారు. దిగువ కోర్టుల్లో కేసుల విచారణ వేగవంతానికి హైకోర్టులు ఆదేశాలు ఇవ్వాలి.

దర్యాప్తు సంస్ధల విచారణకు సహకరించని నిందితుల బెయిళ్లను రద్దు చేయాలని సూచించారు. హైకోర్టులు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులకూ నిర్ణీత గడువు ఉండాలి. ట్రయల్ కోర్టుల్లో కేసుల విచారణపై సమీక్షించేందుకు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా అమికస్ క్యూరీ సూచించారు ఈ కమిటీలు తరచుగా సుప్రీంకోర్టుకు తాజా పరిస్దితిపై నివేదికలు పంపాలని కూడా విజయ్ హన్సారియా సిఫార్సు చేశారు.

 జగన్, సాయిరెడ్డి కేసుల్లో తీర్పు వేళ

జగన్, సాయిరెడ్డి కేసుల్లో తీర్పు వేళ

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్లు విచారణ పూర్తి చేసుకున్నాయి. వీటిపై ఇవాళ సీబీఐ కోర్టు తమ తీర్పు వెలువరించబోతోంది. ఈ తీర్పు వేళ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సమర్పించిన సిఫార్సులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఎంత సీరియస్ గా ఉందో ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులకు సైతం తాజాగా అర్దమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులు తీసుకునే నిర్ణయాలు కూడా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఉండే అవకాశం ఉంది. తాజాగా అమికస్ క్యూరీ చేసిన సిఫార్సుల్ని సీబీఐ కోర్టు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.

 సుప్రీం ఆమోదిస్తే జగన్ ఇరుకునపడతారా ?

సుప్రీం ఆమోదిస్తే జగన్ ఇరుకునపడతారా ?

ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులు, నిందితుల బెయిల్, బెయిల్ రద్దు పిటిషన్లకు సంబంధించి అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులు సుప్రీంకోర్టుకు చేరాయి. వీటిని నేడో రేపో సుప్రీంకోర్టు ఆమోదించబోతోంది. అదే జరిగితే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో పదేళ్లుగా సాగుతున్న విచారణపై కచ్చితంగా ప్రభావం పడబోతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుల విచారణ వేగవంతానికి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఈ సిఫార్సుల ఆమోదం కూడా జరిగితే అప్పుడు ఈ కేసుల్లో విచారణను సమీక్షించి, రోజువారీ విచారణ జరిపించేందుకు, ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు మానిటరింంగ్ కమిటీలు నివేదికలు ఇచ్చేందుకు కూడా ఆదేశాలు వెలువడటం ఖాయం. అఫ్పుడు ఈ వ్యవహారం మరింత సీరియస్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటివరకూ నత్తనడకన సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోవడంతో పాటు తీర్పులు కూడా అదే స్పీడ్ లో వెలువడే అవకాశాలు లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+