వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ చరిత్రలో తొలిసారి - ఇర్రేడియేషన్, అనూహ్య సీటింగ్ - వర్షాకాల భేటీ ఎప్పుడు, ఎలాగంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 26లక్షలు దాటేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,489 కేసులు, 944 మరణాలు నమోదయ్యాయి. కరోనా మృతుల సంఖ్య 50వేల మార్కును దాటేసింది. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో గడిచిన ఐదు నెలలుగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. నిరుద్యోగం 45ఏళ్ల గరిష్టానికి చేరింది. మరోవైపు మత ఘర్షణలు, చైనాతో సరిహద్దు వివాదంలో హిసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి. వీటన్నింటిపై చర్చించేందుకు భారత పార్లమెంట్ సమాయత్తమవుతున్నది.

అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్

 ఈ వారమే ఏర్పాట్లు పూర్తి..

ఈ వారమే ఏర్పాట్లు పూర్తి..

ఆరు నెలల వ్యవధిలో సభ తప్పక సమావేశం కావాల్సిందేనన్న రాజ్యాంగ నిబంధన మేరకు.. కరోనా పరిస్థితుల్లోనూ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకోసం పార్లమెంటు చరిత్రలోనే తొలిసారి అనూహ్య, వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో సీటింగ్ స్వరూపం పూర్తిగా మారిపోనున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలతోపాటు ఉభయసభలూ వైరస్ లేదా ఇతర సూక్ష్మ జీవుల బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సభలను కొత్తగా తీర్చిదిద్దే పనులు ఆగస్టు మూడో వారంలోగా పూర్తికానున్నాయి. వర్షాకాల సమావేశాలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభంకానున్నాయి.

 సమయం, సీటింగ్ ఇలా..

సమయం, సీటింగ్ ఇలా..

ఇన్నాళ్లూ ఉభయ సభలూ ఉదయం 11 గంటలకు ప్రారంభమై, బిజినెస్ ను బట్టి రాత్రి వరకూ కొనసాగగా.. ఈ వర్షకాల సమావేశాల్లో మాత్రం సీన్ పూర్తిగా మారిపోనుంది. ఉదయం పూట లోక్‌సభ నాలుగు గంటలపాటు, మధ్యాహ్నం తర్వాత రాజ్యసభ నాలుగు గంటలపాటు సమావేశం కానుంది. 1952 తర్వాత పార్లమెంటులో సీటింగ్ ఏర్పాటు మారడం ఇదే తొలిసారి. రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో 60 మంది చాంబర్ లో, 51 మంది ఎంపీలు గ్యాలరీల్లో, మిగతా 132 మందికి లోక్ సభ చాంబర్ ఆసీనులు కానున్నారు. అలాగే లోక్ సభ సభ్యులు కూడా రెండు చాంబర్లు, గ్యాలరీల్లోనూ కూర్చోనున్నారు.

భారీ స్క్రీన్లు.. ఎక్కడైనా మాట్లాడేలా...

భారీ స్క్రీన్లు.. ఎక్కడైనా మాట్లాడేలా...

సోషల్ డిస్టెన్సింగ్ నియమాల ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి గ్యాలరీల్లోనూ ఎంపీలు కూర్చోనుండటంతో విజిటర్స్, మాజీలను అనుమతించబోరు. స్పీకర్ చైర్ నుంచి దూరంగా కూర్చున్నప్పటికీ సభ్యులు మాట్లాడేందుకు, సభను వీక్షించేందుకు వీలుగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని, ఆడియో కన్సోల్స్ ను ఏర్పాటుచేశారు. చాంబర్లు, గ్యాలరీల్లో ఒక్కోటి 85 అంగుళాల నాలుగు పెద్ద టెలివిజన్ స్క్రీన్లు, 40 అంగుళాల 6 టెలివిజన్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

 క్రిముల కట్టడికి స్పెషల్ పరికరాలు..

క్రిముల కట్టడికి స్పెషల్ పరికరాలు..

కరోనా వేళ సోషల్ డిస్టెన్స్ తోపాటు గాలిలోని ఇతర సూక్ష్మ జీవులను నిర్వీర్యం చేయగలిగే అల్ట్రావయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ పరికరాలను ఉభయ సభల్లో అమర్చుతున్నారు. లోక్‌సభ, రాజ్య సభ చాంబర్లు, గ్యాలరీల్లో.. రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈనెల 17న జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి.

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

English summary
Massive preparations are underway as the Monsoon Session of the Parliament is all set to begin from the first week of September. Keeping the coronavirus pandemic in mind, the Parliament session this time is expected to include a number of firsts to ensure each member’s safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X