వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ భయాల మధ్య అంతర్జాతీయ వాణిజ్య విమానాల రద్దు జనవరి 31వరకు పొడిగింపు: డిజిసిఏ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల మధ్య డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి వచ్చే, భారతదేశం నుండి వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను 2022 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు మరియు ప్రత్యేకంగా ఆమోదించిన విమానాలకు ఈ పరిమితి వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

omicron variant: డేంజరస్ మ్యూటేషన్స్; కరోనా మహమ్మారి గమనాన్నే మార్చొచ్చు; డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్omicron variant: డేంజరస్ మ్యూటేషన్స్; కరోనా మహమ్మారి గమనాన్నే మార్చొచ్చు; డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

 అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలపై డీజీసిఏ సర్క్యులర్

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలపై డీజీసిఏ సర్క్యులర్

దేశంలో కరోనావైరస్ మహమ్మారి యొక్క అత్యంత వ్యాప్తి చెందగల ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనల మధ్య ఈ ఆర్డర్ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నా అత్యధికంగా వ్యాప్తి చెయ్యగల అవకాశం ఉందని, డేంజరస్ ఉత్పరివర్తనలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ మేరకు విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల విషయంలో ఆందోళన నెలకొనగా ఈ మేరకు రెగ్యులేటర్ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.

అంతర్జాతీయ విమాన సర్వీసులు జనవరి 31 వరకు రద్దు

అంతర్జాతీయ విమాన సర్వీసులు జనవరి 31 వరకు రద్దు

భారతదేశానికి మరియు భారతదేశం నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను నిలిపివేయడాన్ని జనవరి 31, 2022 వరకు పొడిగించాలని నిర్ణయించింది.డిసెంబర్ 15 నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ విమానాలు నడపడానికి అనుమతిస్తూ నవంబర్ 26న జారీ చేసిన సర్క్యులర్‌లో కేంద్ర విమానయాన సంస్థ కొత్త నిబంధనను స్వల్పంగా సవరించింది. ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ ఈ విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని భారత్ కూడా భావించింది.

 డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమానాలు నడపాలని జారీ చేసిన సర్క్యులర్ లో మార్పులు

డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమానాలు నడపాలని జారీ చేసిన సర్క్యులర్ లో మార్పులు

భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న కారణంగా డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డీజీసిఏ కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒమిక్రాన్ ఆందోళనల మధ్య ఈ విషయం సమీక్షించబడిందని, ఈ మేరకు తాజాగా గత సర్క్యులర్ ను సవరిస్తూ ప్రకటన చేసింది

Recommended Video

Omicron Variant : NO Lockdown - Need To Follow Protective Measures | Guidelines || Oneindia Telugu
 అంతర్జాతీయ కార్గో సేవలు యధాతధం, కొనసాగనున్న నిర్ణయించిన రూట్లలో సర్వీసులు

అంతర్జాతీయ కార్గో సేవలు యధాతధం, కొనసాగనున్న నిర్ణయించిన రూట్లలో సర్వీసులు

డిసెంబరు 1న, దేశంలో ఒమిక్రాన్ కేసులు కనుగొనబడిన వెంటనే ఈ ఉత్తర్వును కొనసాగించకూడదని డీజీసిఏ నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా మార్చి 23, 2020 నుండి దేశంలో షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు నిలిపివేయబడ్డాయి. అయితే, మే 2020 నుండి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మరియు జూలై 2020 నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్లలో పనిచేస్తున్నాయి. ఇక డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలి అనుకున్నా ఒమిక్రాన్ దెబ్బకు మళ్ళీ తేదీ మార్చుకోవాల్సి వచ్చింది . ఇక అంతర్జాతీయ కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదని, అంతర్జాతీయ కార్గో సేవలు కొనసాగుతాయని డీజే పేర్కొంది. కేస్ టు కేస్ బేసిస్ లో ఇప్పటికే షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమానాలు ఎంపిక చేసిన రూట్లలో కొనసాగుతాయని వెల్లడించింది.

English summary
Amid fears of omicran International commercial flights canceled until January 31 2022, DGCA in a statement. It has extended the suspension on international commercial flights till January 31
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X