వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా 'ఆపరేషన్ సౌత్': కేరళలో పట్టు కోసం..

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేరళ పైన కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికి చాలాసార్లు బీజేపీ చేసిన ప్రయత్నాలు కేరళలో ఫలించలేదు. ఎప్పటికప్పుడు ఆ పార్టీకి కేరళలో ఎదురుదెబ్బ తగులుతోంది. దక్షిణాది రాష్ట్ర్లాలో బీజేపీకి అంతగా పట్టులేదు. అందులోను కేరళలో ఆ పార్టీ ఏమాత్రం లేదని చెప్పవచ్చు.

దీంతో ఎలాగైనా కేరళలో తొలి అడుగు వేసి తీరాల్సిందేనన్న దృఢ సంకల్పంతో పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు.

 కేరళ

కేరళ

ఆదివారం కేరళ చేరుకుని పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న అమిత్ షా, సోమవారం కూడా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

 కేరళ

కేరళ

ఆదివారం నాటి పర్యటనలో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. పార్టీని రాష్ట్రంలో పాదుకొల్పేందుకు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కావడమొక్కటే మార్గమని ఆయన ఉద్బోధించారు.

 కేరళ

కేరళ

ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం నాటి పర్యటనలో భాగంగా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించనున్న కీలక సమావేశంలో పాల్గొనే అమిత్ షా ముఖ్య నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 కేరళ

కేరళ

కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న వర్గాలను తమ దరికి చేర్చుకునేందుకు షా ప్రత్యేక కార్యాచరణను పార్టీ శ్రేణులకు వెల్లడించనున్నట్లు సమాచారం.

కేరళ

కేరళ

ఉత్తరప్రదేశ్‌లో ఒంటిచేత్తో పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టిన అమిత్ షా, కేరళలోనూ మంచి ఫలితాలనే రాబడతారని ఆ పార్టీ కార్యకర్తలు అంచనాలేస్తున్నారు. కాగా, పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడు వి మురళీధరన్‌ను తొలగించాలని అమిత్ షా ముందు మొరపెట్టుకున్నారు.

English summary
BJP National President Amit Shah started his maiden visit to Kerala on Monday with a section of leaders in the state seeking removal of Kerala party president V. Muraleedharan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X