చైనాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తన అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని, భారత్‌ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరరన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ పరిధిలోకి వస్తుందని చైనా చెబుతోంది.

ఈ ప్రాంతంలో ఇండియా అధికార కార్యక్రమాలు నిర్వహించడమంటే తమ దౌశ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా అంటోంది. ఇండియా-చైనా మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో అమిత్ షా చైనా సరిహద్దు గ్రామమైన కిబితూలో వైబ్రెంట్‌ విలేజ్ ప్రోగ్రాం(వీవీపీ)ను ప్రారంభించారు.

Amit Shah Speech

2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా అభివృద్ధికి దూరంగా.. అల్లకల్లోలంగా ఉండేదని, అయితే తమ ప్రభుత్వం చేపట్టిన లుక్‌ ఈస్ట్‌ విధానంతో భారతదేశ అభివృద్ధిలో ఈ ప్రాంతం కూడా భాగమైందని అమిత్ షా అన్నారు. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను దేశం నుంచి వేరు చేయలేరంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి అమిత్‌షా హెచ్చరించారు.

భారత సైనిక, సరిహద్దు భద్రతా దళాలను ఆయన ప్రశంసించారు. ఐటీబీపీ జవాన్లు, ఇండియన్‌ ఆర్మీ అహర్నిశలూ శ్రమిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని, జవాన్లు చేస్తున్న త్యాగం వల్లే దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారన్నారు. ఇండియాను చెడు దృష్టితో చూసే శక్తి ఎవరికీ లేదని గర్వంగా చెప్పగలమని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+