విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!
నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెల 20న పార్లమెంట్ మార్చ్ కు వెళ్తున్న విద్యార్దులపై ఢిల్లీ పోలీసులు చేసిన బలప్రయోగంపై ఇప్పటివరకూ పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎట్టకేలకు విపక్షాల ఒత్తిడికి తలొగ్గారు. రెండు రోజుల క్రితమే పార్లమెంట్ కు వచ్చేందుకు అంగీకరించిన ఆయన.. ఆ తర్వాత విపక్షాలు జార్ఖండ్, పంజాబ్ విద్యార్ధుల ఆందోళనలపైనా చర్చించాలని షరతులు పెట్టారు. దీనికి విపక్షం అంగీకరించకపోవడంతో చేసేది లేక ఇవాళ మధ్యాహ్నం పార్లమెంట్ కు వచ్చేందుకు అమిత్ షా అంగీకరించారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభకు వస్తానని, ఢిల్లీ పోలీసులు విద్యార్దులపై ఈ నెల 20న చేసిన బలప్రయోగంపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకూ చర్చిద్దామని విపక్షాలకు అమిత్ షా (Amit Shah) తెలిపారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు చర్చ కోసం 24 గంటల సమయాన్ని ఆయన కేటాయించారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

అయితే విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం అమిత్ షా ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆయన చెప్పేది మాకు అనవసరం అని తేల్చేశారు. నీట్ విద్యార్థుల నిరసనల అణచివేతపై అమిత్ షా ప్రకటన చేయాలని, రామమందిర విరాళాల చోరీపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటులో రెండు వారాలుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో చర్చ కోరుతూ అధికారికంగా లేఖ సమర్పిస్తే సభలో చర్చకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని, చర్చ జరగాలా లేక సభకు అంతరాయం కొనసాగాలా అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రతిపక్షాలేనని తెలిపారు.














Click it and Unblock the Notifications