వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసదుద్దిన్ ఓవైసికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అమిత్ షా...

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ విభజన బిల్లుపై లోక్‌లోభలో వాడివేడి చర్చలు జరిగాయి. ఈ సంధర్భంగా ఎమ్ఐఎమ్ నేత అసదుద్దిన్ ఓవైసీ విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేస్తుందని విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఓవైసీ మాటలకు కేంద్రమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చాడు.

బీజేపీ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేయడం లేదని, గతంలో ఉన్న జరిగిన తప్పిదాన్ని సరి చేస్తున్నామని అమిత్ షా అన్నారు. ఈనేపథ్యంలోనే ఐదేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన అభివృద్ధిని చూసి... అక్కడి ప్రజలు ఆర్టికల్ 370 వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటో అర్థం చేసుకుంటారని అన్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు లోపున్న పిల్లలందరికీ విద్యా హక్కు ఉన్నప్పటికీ... జమ్మూ కశ్మీర్‌లో ఇది అమలు కావడంలేదని వివరించారు. 370 వల్ల కశ్మీర్ ప్రజలకు ఒరింగేదేమిటని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370పై ఎప్పుడైన చాల సిరియస్ గా ఆలోచించారా అంటూ ధ్వజమెత్తారు. కాగా ఈ ఆర్టికల్ ప్రజల హక్కులను కాలరాసిందని, ఇంకా అక్కడ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.

Amit Shah gave a strong counter to Owaisis comments

కాగా అంతకు ముందు ఓవైసీ మాట్లాడుతూ...దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందన్నారు అసదుద్దీన్. ఆర్టికల్ 370 రద్దు చేయడం మోడీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదమని విమర్శించారు. ఆర్టికల్ 370 తాత్కాలికమని గతంలో సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తుచేశారు. శ్రీనగర్‌ను వెస్ట్ బ్యాంక్ మాదిరిగా తయారు చేశారని మండిపడ్డారు. కేంద్ర బలగాల నిర్బంధం నుంచి కశ్మీరీలకు విముక్తిం కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఈద్ పండుగ వస్తోంది. గొర్రె పిల్లలకు బదులుగా కశ్మీరీలు బలి కావాలని మోడీ సర్కార్ కోరుకుంటున్నట్టు కనబడుతుందని విమర్శించారు. ఇలా జరగాలని అనుకుంటే వారు త్యాగాలకు వెనకాడరని పేర్కొన్నారు.

English summary
Union home Minister Amit Shah gave a strong counter to Owaisi's comments on artcal 370 a historic mistake in lok sabha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X