పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?
బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతోపాటు అమిత్ షా బుధవారం సాయంత్రం నాలుగు గంటలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. దీంతో పార్టీ చీఫ్‌గా తిరిగి అమిత్ షానే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా గాంధీనగర్ నుండి పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఆయన మంత్రి వర్గంలో చేరనున్నారు. ఒకవేళ అయన మంత్రివర్గంలో చేరితే కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఢిఫెన్స్, లేదా విదేశీ వ్యవహారాలు, హోం,తోపాటు ఫైనాన్స్ మినిస్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.దీంతో ఆయన పార్టీ పదవి నుండి తప్పుకుంటారనే వార్తలు వెలువడ్డాయి.
ఈనేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ పార్టీ ఇంచార్జ్‌గా వ్యవహరించిన జేపీ నడ్డాను పార్టీ చీఫ్‌గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.అయితే రానున్న కొద్ది రోజుల్లో బీజేపీ అధికారంలో ఉన్న మహరాష్ట్ర్ర, హరియాణ, జార్ఖండ్ రాష్ట్ర్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారీటితో గెలిచిన నేపథ్యంలో రాష్ట్ర్రాల్లో అధికారంలో ఎవైన ఇబ్బందులు తలెత్తితే తిరిగి పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీ చీఫ్‌ను ఇప్పట్లో మార్చే అలోచనలో మోడీ లేనట్టు కనిపిస్తోంది. కీలకమైన ఎన్నికల తర్వాత పార్టీ చీఫ్‌ను మార్చనున్నట్టు సమాచారం. ఒకవేళ పార్టీ అధ్యక్షుడుగా నడ్డాతోపాటు పాటు భుపెందర్ యాదవ్ పేరు కూడ వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications