అమిత్ షా 20 కిలోలు తగ్గారు, ఎలాగంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: యోగా సాధన ద్వారా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 20 కిలోల బరువు తగ్గారని ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా చెప్పారు. అమిత్ షా బరువు తగ్గేందుకు సహకరించిన యోగాకు రామ్ దేవ్ బాబా ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచ యోగా దినోత్సవానికి ఒక్కరోజు ముందు రామ్ దేవ్ బాబా ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన మంగళవారం నాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

'Amit Shah lost 20kg thanks to yoga', says yoga guru Ramdev

యోగా అనేది ఓ క్రీడ అని రామ్ దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గతంలో యోగా క్రీడ కాదనే అభిప్రాయం ఉండేదన్నారు. అయితే యోగాను కూడ క్రీడలో జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఒలంపిక్స్ లో యోగాను ఓ క్రీడ కింద చేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా బుదవారం నాడు యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yoga guru Ramdev said on Tuesday that BJP president Amit Shah managed to lose as much as 20 kilos thanks to practicing yoga.
Please Wait while comments are loading...