2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఆయనే.. సంచలన ప్రకటన చేసిన అమిత్ షా!!
2024 ఎన్నికలకు ఇప్పటినుంచి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటన చేశారు. పాట్నాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

2024 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీయే...
హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. '2024లో బీజేపీ-జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీయే' అని ప్రకటించారు. మోడీ చరిష్మా దేశంలో కొనసాగుతున్న వేళ మళ్లీ వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీ నేనని అమిత్ షా తేల్చిచెప్పారు. 2024లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడం ద్వారా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు.

2024లో బీజేపీ-జేడీయూ కలిసి లోక్సభ ఎన్నికల్లో, 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో
2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే అధికారంలోకి వస్తామని, మళ్లీ మోడీ దేశానికి ప్రధాని అవుతారని పేర్కొన్నారు. 2024లో అలాగే 2025లో బీహార్‌లో కలిసి ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నామనీ వెల్లడించారు. బీజేపీ జేడీయూ కలిసి 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తామని 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి గందరగోళం లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని బిజెపి జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ కూడా వెల్లడించారు.

ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన అమిత్ షా వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికల కోసం, ప్రధానమంత్రి అభ్యర్థుల చర్చ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కొత్త ముఖాలకు వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అవకాశం ఇస్తారని తరచూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక వాటికి చెక్ పెడుతూ అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

13-15 వరకు జాతీయ జెండాను ప్రతి గ్రామంలో ఎగరవెయ్యాలన్న అమిత్ షా
అంతేకాదు సమావేశంలో కాశ్మీర్‌కు చెందిన మహిళలు తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని సభ్యులందరికీ పంపిణీ చేశారు. దీని ద్వారా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ప్రజల ఆలోచనలు మారుతున్నాయని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.దేశంలోని ప్రతి మూలలో జాతీయ జెండాను ఎగురవేస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల దళితులు మంత్రులుగా పనిచేశారని వెల్లడించారు. దేశంలో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని షా అన్నారు. ఆగస్ట్ 13-15 నుండి, మూడు రోజుల పాటు దేశంలోని ప్రతి మూలలో జాతీయ జెండాను ఎగురవేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications