అమిత్ షా అరుదైన రికార్డ్.. దేశ చరిత్రలోనే తొలిసారిగా..

బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు పొంది చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన నేతగా నయా చరిత్ర లిఖించారు. ఇక తాజాగా అమిత్ షా కూడా ఓ అరుదైన రికార్డు సాధించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డ్ నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ పేరిట ఉండగా.. ఆగస్టు 5న అమిత్ షా ఆ రికార్డును బద్దలు కొట్టి తొలి స్థానంలో నిలిచారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డ్ నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ పేరిట ఉండగా.. ఆగస్టు 5న అమిత్ షా ఆ రికార్డును బద్దలు కొట్టారు అమిత్ షా. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనాటి నేత గోవింద్ వల్లభ్ పంత్ ఆరు సంవత్సరాలకు పైగా హోం మంత్రిగా పనిచేశారు.

అయితే ప్రధాని మోదీ తొలి ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రిగా ఐదు సంవత్సరాలపాటు పని చేశారు. అయితే తాజాగా అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఆ రికార్డునూ చెరిపేసి.. ఆగస్టు 5 నాటికి ఆరు సంవత్సరాల 64 రోజులను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా హోం మంత్రిగానే కొనసాగుతున్న తరుణంలో ఆయన రికార్డు మరింత పదిలం కానుంది.

Amit Shah Makes History Becomes India s Longest-Serving Home Minister

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో అత్యంత ముఖ్య నేతగా పేరుగాంచారు. దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇటీవల పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లోనూ ఆయన కీలక సూచనలు సైన్యం విజయానికి దోహదపడ్డాయి. గతంలోనూ అమిత్ షా 370 ఆర్టికల్ రద్దు, జమ్ము, లద్ధాఖ్ లను రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం.. తదితర కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+