రంగంలోకి అమిత్ షా, కొలిక్కి రానున్న సీట్ల సర్దుబాటు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివ సేన పార్టీల మద్య సీట్ల సర్దుబాటు బుధవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం పార్టీ శ్రేణులతో మాట్లాడి సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు మంగళవారం రాత్రి అమిత్ షా ముంబైకి చేరుకున్నారు.
భారతీయ జనతా పార్టీ మాత్రం చెరో 135 సీట్లలో పోటీలోకి దిగాలోనే ఆలోచనతో ఉంది. ఉద్దవ్ ధాకరే మాత్రం శివ సేన 150 సీట్లు ఇవ్వమని అడుగుతున్నామని సోమవారం అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో బిజెపి మిషన్ 272 పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లగా ఇప్పుడు మేము మిషన్ 150తో ముందుకెళడంలో తప్పేంటని అన్నారు.

ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కాస్తంత ఎదురుగాలి తగలడం కూడా శివసేనకు కలిసొచ్చే అంశం. ఇరు పార్టీల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, చర్చలు ఒక కొలిక్కి రాకపోతే శివసేన సొంతంగానైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ సభ్యులు తెలిపారు.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.












Click it and Unblock the Notifications