అమిత్ షా తమిళనాడు పర్యటన రద్దు, పన్నీర్, పళనిసామి ఒక్కటి అవుతున్నారని!
చెన్నై/న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు పర్యటన రద్దు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం కానున్న నేపథ్యంలోనే అమిత్ షా తమిళనాడు పర్యటన వాయిదా వేసుకున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం నుంచి మూడురోజుల పాటు తమిళనాడులో పర్యటించవలసి ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అమిత్ షాకు ఘనస్వాగతం పలకడానికి కమలనాథులు భారీ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. చెన్నై నగరంలో భారీగా హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అనుమతి లేకుండా కమనాథులు ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగి వాటిని తొలగించారు. ఇదే సమయంలో పోలీసుల తీరుపై కమలనాథులు మండిపడ్డారు. ఇలాంటి సమయంలో అమిత్ షా పర్యటక రద్దు కావడంతో తమిళనాడులోని బీజేపీ నేతలు నిరాశకు గురైనారు.
ఢిల్లీలోని బీజేపీ నాయకులు చక్రం తప్పి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలను ఆడిస్తున్నారని, వారు చెప్పినట్లు ఇద్దరు నాయకులు డ్రామాలు ఆడుతున్నారని డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం అయిన వెంటనే తమిళనాడులో అడుగుపెడితే లేనిపోని ఆరోపణలు వస్తాయని భావించిన అమిత్ షా తన పర్యటన వాయిదా వేసుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications